వాతావరణం
చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. అప్పుడప్పుడు ఆకాశం మేఘావృతం అవుతుంది. చల్లటి గాలులు వీస్తాయి.
చలి కాలంలో చిరుధాన్యాల వినియోగం, ఆకుకూరల సమాహారమే ఆరోగ్యానికి ఎంతో మేలని అంటున్నారు పాలమూరు జనరల్ ఆస్పత్రి న్యూట్రిషనిస్టు శైలజ. ఆ వివరాలు ఆమె మాటల్లో.. శరీరానికి వేడిని అందించే ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. చిరుధాన్యాలు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలూ రావు. శరీరంలో వేడిని పెంచేందుకు రాగులు, జొన్నల, కొర్రలతో చేసిన జావలు తాగడం మంచిది. తేనె, నిమ్మరసం కలిపిన గోరువెచ్చటి నీళ్లు తాగితే మలబద్ధక సమస్యతో పాటు శరీరం ముడతలు పడకుండా చూస్తుంది. రాగులు, సామ బియ్యం, మొక్కజొన్న, కొర్రలు, జొన్నలు, తోట కూర గింజలు, కోడిసాము, సజ్జలు వరిగెలు, నువ్వులు ఆరోగ్యకర ఆహారం. శీతాకాలంలో కండరాలు పట్టేయడం వంటి సహజ సమస్యలకు పరిష్కారం చూపుతుంది. నువ్వులు తగిన మోతాదులో తీసకుంటే కాల్షియం, మాంగనీసు, ఇనుప ఖనిజాలు అందుతాయి. భోజనం తర్వాత నువ్వులతో చేసే మిఠాయిలు తినడం ద్వారా సరిపడా తేమ సమకూరుతుంది. వేరుసెనగతో గుండెకు మేలు. శీతాకాలంలో అందుబాటులో ఉన్న ఆకుకూరలన్నీ అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లనందిస్తాయి. ప్రతి రోజు ఆహారంలో తక్కువలో తక్కువ 400 గ్రాములు పండ్లు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment