‘ఇందిరమ్మ’ సర్వేలో వేగం పెంచాలి
ప్రాథమిక పాఠశాల తనిఖీ..
వడ్డెగేరిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు సమయ పాలన పాటిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులకుగాను ఒక్కరే ఉండటంతో నెలరోజుల జియో ట్యాగింగ్ అటెండెన్స్ వివరాలు ఇవ్వాలని.. విధులకు హాజరుకాని ప్రధానోపాధ్యాయుడికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఎంఈఓను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలన్నారు. కలెక్టర్ వెంట పుర కమిషనర్ పూర్ణచందర్, తహసీల్దార్ రమేష్‌రెడ్డి ఇతర అధికారులు ఉన్నారు.
వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని బసవన్నగడ్డ, పట్టణ శివారు రాజనగరం వడ్డెగేరిలో కొనసాగుతున్న సర్వేను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒక్కో సర్వేయర్ రోజు కనీసం 25 ఇళ్లు పూర్తి చేయాలని.. వివరాలను ఆన్‌లైన్‌లో పక్కాగా తప్పులు లేకుండా నమోదు చేయాలని సూచించారు. యాప్‌లో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. అలాగే రాజనగరం శివారులోని అమ్మ చెరువును పరిశీలించి కట్టపై ఏర్పాటుచేసిన వీధిదీపాలు వెలుగుతున్నాయా లేదా అని పుర కమిషనర్‌ను అడిగి తెలుసుకున్నారు. కట్టను శుభ్రం చేయించడంతో పాటు ఖాళీ స్థలంలో మొక్కలు నాటించాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment