వనపర్తి టౌన్: ఔట్‌సోర్సింగ్ కార్మికులను క్రమబద్దీకరించాలనే డిమాండ్‌తో మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) పిలుపు మేరకు కార్మికులు శనివారం సమ్మెలో పాల్గొన్నారు. పారిశుద్ధ్య విభాగంలోని 122 మంది, ఇంజినీరింగ్ విభాగంలోని వాటర్ లైన్‌మెన్లు, ఎలక్ట్రీషియన్స్, పార్కుల్లో విధులు నిర్వర్తించే కార్మికులు సుమారు 80 మంది విధులకు దూరంగా ఉన్నారు. వీరితో పాటు కార్యాలయంలోని వివిధ విభాగాల్లో పనిచేసే ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. 16 చెత్త సేకరణ వాహనాలు కార్యాలయానికే పరిమితమయ్యాయి. పుర పారిశుద్ధ్య కార్మికులు శనివారం ఒక్కసారిగా విధులకు గైర్హాజరుకావడంతో ఇంటింటి చెత్త సేకరణ, చెత్తకుప్పల తొలగింపు, డ్రెయినేజీల శుభ్రత ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆదివారం నుంచి కార్మికులు విధులకు హాజరవుతారని పుర అధికారులు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment