కొలిక్కి వచ్చినట్లేనా..!?
ఆధిపత్య పోరు, వివాహేతర సంబంధం కోణంలోనూ..
హత్యకేసు విచారణ రాజకీయ ఆధిపత్య పోరు, వివాహేతర సంబంధం కోణాల్లో దర్యాప్తు ము మ్మరం చేస్తున్నట్లు పోలీస్ అధికారుల ద్వారా తెలుస్తోంది. రాజకీయ ఆధిపత్య పోరే హత్యకు కారణమనే వాదనలు జిల్లాలో, రాజకీయ పార్టీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తున్నాయి. నిజానిజాలు ఏమిటనే విషయాన్ని పోలీసు అధికారులు ఆధారాలతో నిరూపించాల్సి ఉంది.
శ్రీధర్‌రెడ్డి హత్యకేసులో తుదిదశకు పోలీసుల దర్యాప్తు
వనపర్తి: అసెంబ్లీ ఎన్నికల అనంతరం 2024, మే 23న చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ముఖ్య అనుచరుడు శ్రీధర్‌రెడ్డి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైన విషయం విధితమే. ఎన్‌సీఆర్‌బీ (నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో)లో నమోదైన ఈ కేసు దర్యాప్తు పోలీసులకు సవాల్‌గా మారింది. తెలివిగా ఎలాంటి ఆధారాలు లేకుండా చేసిన హత్య కేసును ఛేదించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సీఐడీ డీజీ శిఖాగోయల్ నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ టెక్నీషియన్లను గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి రప్పించి సాంకేతిక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ స్వయంగా గ్రామాన్ని సందర్శించి విచారణ ముమ్మరం చేశారు. సుమా రు 52 మందికి పైగా అనుమానస్తులను విచారించి కొన్ని ఆధారాలు సేకరించినట్లు సమాచారం.
లైవ్ డిటెక్టర్, పాలిగ్రాఫ్ టెస్టులకు
సమయాత్తం..
హత్య జరిగిన రోజు నిందితులు సెల్‌ఫోన్లు తీసుకువెళ్లకుండా జాగ్రత్త పడినట్లు పోలీసుశాఖలో చర్చ వినిపిస్తోంది. దీంతో అనుమానం ఉన్న వ్యక్తులపై లైవ్ డిటెక్టర్, పాలిగ్రాఫ్ టెస్టులు చేసేందుకు ఉన్నతాఽధికారులు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నట్లు పోలీసువర్గాలు వెల్లడించగా.. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
సాంకేతిక ఆధారాల సేకరణలో అధికారులు
ఆధారాలతో వెల్లడిస్తాం..
ఎస్పీ రావుల గిరిధర్ తన విధి నిర్వాహణలో 40 శాతం సమయం కేసు విచారణకు వినియోగిస్తున్నారు. రోజువారీగా పురోగతిని అడుగుతున్నాం. ఇప్పటికే 95 శాతం దర్యాప్తు పూర్తయింది. వైద్యుల సమక్షంలో చేయాల్సిన పరీక్షల కోసం నిపుణుల సాయం తీసుకుంటున్నాం. హత్య కేసుతో సంబంధం ఉన్న వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తేలేదు. త్వరలో పూర్తి వివరాలు ఆధారాలతో వెల్లడిస్తాం.
– సత్యనారాయణ, మల్టీజోన్–2 ఐజీ
Comments
Please login to add a commentAdd a comment