తుది దశకు వరి కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

తుది దశకు వరి కొనుగోళ్లు

Published Mon, Dec 30 2024 12:40 AM | Last Updated on Mon, Dec 30 2024 12:40 AM

తుది దశకు వరి కొనుగోళ్లు

తుది దశకు వరి కొనుగోళ్లు

30 వేల మెట్రిక్‌ టన్నులు..

జిల్లాలోని పెబ్బేరు, శ్రీరంగాపురం, చిన్నంబావి, వీపనగండ్ల, పాన్‌గల్‌ మండలాల్లో వరి కోతలు ఆలస్యం కావడంతో వరి కొనుగోలు కేంద్రాలు వచే నెల మొదటి వారం వరకు కొనసాగనున్నాయి. ఆయా మండలాల్లో రైతుల నుంచి 30 వేల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం సేకరించనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా మిగిలిన మండలాల్లో ఇప్పటికే కొనుగోళ్లు పూర్తి కావడంతో రైతులు యాసంగి సాగుకు పొలాలను చదును చేసుకుంటున్నారు. కొందరు రైతులు అక్కడక్కడా కేంద్రాలకు రైతులు తాము పండించిన ధాన్యాన్ని తీసుకొచ్చి విక్రయిస్తున్నారు.

మండలాల వారీగా వరి ధాన్యం కొనుగోలు ఇలా

మండలం సేకరించిన ధాన్యం చెల్లించిన డబ్బులు

(టన్నుల్లో..) (రూ.లలో..)

కొత్తకోట 21,000 44,06,17,184

పాన్‌గల్‌ 21,000 39,60,34,528

పెబ్బేర్‌ 16,000 20,07,60,736

వనపర్తి 14,000 27,88,72,352

పెద్దమందడి 13,000 26,92,07,288

గోపాల్‌పేట 14,000 26,75,12,704

మదనాపురం 12,000 24,90,74,272

ఖిల్లాఘనపురం 12,000 24,05,39,456

ఆత్మకూర్‌ 11,000 18,04,96,928

వీపనగండ్ల 9,000 13,68,31,744

రేవల్లి 9,000 12,37,35,808

అమరచింత 7,000 15,47,80,192

శ్రీరంగాపురం 7,000 10,30,85,952

చిన్నంబావి 4,000 4,24,68,992

అమరచింత: రపభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు జిల్లావ్యాప్తంగా 255 గ్రామాల్లో గత నెల 15 నుంచి వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ఇప్పటి వరకు 1,74,603 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించారు. విక్రయించిన ధాన్యానికి సంబంధించి నేటి వరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.308 కోట్లు జమచేసింది. వీటితో పాటు ప్రభుత్వం ప్రకటించిన బోనస్‌ డబ్బులు రూ.27 కోట్ల మేర రైతులకు చెల్లించారు. జనవరి మొదటి వారం వరకు కొనుగోలు కేంద్రాలు కొనసాగనుండగా మరో 30 వేల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కేంద్రాలకు విక్రయానికి రావచ్చని జిల్లా అధికారులు అంచనాలు వేస్తున్నారు. మొత్తంగా 4 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం సేకరణే లక్ష్యం కాగా.. సుమారు 2 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. 45 రోజుల వ్యవధిలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన వివరాలను అధికారులు ఆన్‌లైన్‌లో త్వరగా నమోదు చేస్తుండటంతో సకాలంలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయడం సాధ్యమైందని.. బోనస్‌ డబ్బులు అందుకున్న రైతులు తోటి వారికి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వెళ్లమని సూచించాలని చెప్పినట్లు జిల్లా అధికారులు తెలిపారు.

లక్ష్యం 4 లక్షల మెట్రిక్‌ టన్నులు

ఇప్పటి వరకు సేకరించింది 1,74,603 మె.ట.

మరో 30 వేల మె.ట.

కొనుగోలు చేసే అవకాశం

రైతులకు చెల్లించిన డబ్బులు రూ.308 కోట్లు.. బోనస్‌ రూ.27 కోట్లు

జనవరి మొదటి వారం వరకు కొనసాగనున్న కేంద్రాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement