‘విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వాలు’
ఆత్మకూర్: ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నాయని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవ ఆరోపించారు. సంఘం ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సోమవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. 1970లో కేరళలోని త్రివేండ్రంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆవిర్భవించిందని.. నాటి నుంచి నేటివరకు విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తూ దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా అవతరించిందన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను నిర్వీర్యం చేసేందుకు పాలకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదవుతున్నా.. నేటికీ విద్యాశాఖ మంత్రిని నియమించుకోలేని దౌర్భాగ్యస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో నాయకులు వినయ్, రమేశ్, శివ, భాను, ప్రణయ్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
అమిత్‌షాను మంత్రివర్గం నుంచి తొలగించాలి
వనపర్తి రూరల్: రాజ్యసభలో అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి అమిత్‌షాను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎండి జబ్బార్, జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించడం అంటే దేశ ప్రజల్ని అవమానించడమే అవుతుందన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మతోన్మాద వైఖరిని ఖండించాలని.. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బాల్‌రెడ్డి, నాయకులు ఎం.రాజు, జీఎస్ గోపి, మేకల ఆంజనేయులు, రమేష్, వెంకటేష్, ఎస్.రాజు, అజయ్, బొబ్బిలి నిక్సన్, నందిమళ్ల రాములు, దేవేందర్ సాయిలీల, ఉమాదేవి పాల్గొన్నారు.
‘పాలమూరు’
ఎత్తిపోతలపై కుట్రలు
సాక్షి, నాగర్‌కర్నూల్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ నుంచి డిండి ప్రాజెక్ట్ ద్వారా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు నీరందించేందుకు ప్రభుత్వం తెచ్చిన జీఓ నంబర్ 159ను రద్దు చేయాలని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాసినట్టు తెలిపారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగునీరు అందించేందుకు ఇప్పటికే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ ఉందని చెప్పారు. ప్రభుత్వం ప్రతిపాదించినట్టుగా పాలమూరు ప్రాజెక్ట్‌లోని ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తరలిస్తే పాలమూరు జిల్లాలోని కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్లకు నీరు అందని పరిస్థితి తలెత్తనుందని చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పూర్తిచేసి త్వరగా ఇక్కడి రిజర్వాయర్లను నీటితో నింపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు స్వార్థ రాజకీయాల కోసం ఇక్కడి నుంచి నీటిని తరలిస్తే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. పాలమూరు ప్రజల సాగునీటి ప్రయోజనాలు కాపాడేందుకు ఎలాంటి త్యాగాలకై నా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రభుత్వం వెంటనే జీవో 159ను రద్దు చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని చెప్పిన ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అలాగే రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంట్‌లో పోరాటం చేసిన బీజేపీ నేత సుష్మాస్వరాజ్ విగ్రహాన్ని సైతం రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment