రైతులకు సాగునీరు అందిస్తాం
చిన్నంబావి: మండల రైతులు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం మండల కేంద్రంలో రైతులను కలిసి మాట్లాడారు. ఈ ప్రాంతం శ్రీశైలం ప్రాజెక్టులో ముంపునకు గురై చాలా నష్టపోయారని, సాగునీటి శాశ్వత పరిష్కారానికి సింగోటం–గోపాల్‌దిన్నె లింక్ కెనాల్ పనులు త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. యాసంగి సీజన్‌లో మూడు విడతల్లో నీరందించేలా చర్యలు తీసుకోవాలని జూరాల ప్రాజెక్టు అధికారులను కోరారు. అదేవిధంగా మండలకేంద్రంలో కాల్వలను కబ్జాచేసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టారని.. కేసులు నమోదు చేయాలని పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి, నియోజకవర్గ నాయకులు కళ్యాణ్‌రావు, బీచుపల్లి యాదవ్, కృష్ణప్రసాద్ యాదవ్, తేజారెడ్డి, బిచ్చన్న, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
Comments
Please login to add a commentAdd a comment