అర్హులకు నష్టం వాటిల్లొద్దు
పాన్‌గల్: సంక్షేమ పథకాల అమలు కోసం నిర్వహిస్తున్న సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సిబ్బందిని ఆదేశించారు. శనివారం మండల కేంద్రంతో పాటు మండలంలోని చింతకుంటలో పర్యటించి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సర్వే తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల లబ్ధిదారుల తుది జాబితా వెల్లడించేందుకు ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించాలని, గ్రామసభ ఏ రోజు ఏ గ్రామంలో నిర్వహిస్తున్నారో ముందుగానే చాటింపు వేయించాలన్నారు. చింతకుంటలో సర్వే తీరును పరిశీలించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేగం పెంచాలని.. అర్హులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరుగొద్దని సూచించారు. అంతకుముందు తహసీల్దార్ కార్యాలయంలోఅధికారులతో సమీక్ష నిర్వహించి రైతుభరోసా పథకంలో వ్యవసాయేతర భూమిల్ని ఎలా గుర్తిస్తున్నారు.. ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు గుర్తించారు అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. విధుల్లో అలసత్వం వహించకుండా అర్హుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. ఆయన వెంట ఏడీఏ చంద్రశేఖర్, తహసీల్దార్ సత్యనారా యణరెడ్డి, ఎంపీడీఓ గోవిందరావు, ఏఓ రాజవర్ధన్ రెడ్డి, ఏంపీఓ రఘురాములు, డీటీ అశోక్‌నాయుడు, ఆర్‌ఐ మహేష్, ఏఈఓలు, సిబ్బంది పాల్గొన్నారు.
సాగుకు యోగ్యంకాని భూములు గుర్తించాలి..
వీపనగండ్ల: సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వాణిజ్య సముదాయాలను రైతుభరోసా పథకం నుంచి తొలగించాలని ఆదేశించారు. గోవర్ధనగిరి సమీపంలో ఉన్న చేపల చెరువులను పరిశీలించి రైస్‌మిల్లులు, ఇళ్ల స్థలాలను కూడా గుర్తించాలన్నారు. ఎలాంటి తప్పులు జరిగినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి లక్ష్మప్ప, డీపీఆర్వో సీతారాం, తహసీల్దార్ వరలక్ష్మి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, మండల వ్యవసాయ అధికారి డాకేశ్వర్‌గౌడ్, డీప్యూటీ తహసీల్దార్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి
Comments
Please login to add a commentAdd a comment