కరీమాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఆరు గ్యారంటీ పథకాలకు సంబంధించి అభయహస్తం పేరుతో లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా వరంగల్ జిల్లాలోని 13 మండలాలతోపాటు వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీలు, గ్రేటర్ వరంగల్ పరిధిలోని 32 డివిజన్లలో దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 46,895 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 14వ డివిజన్ బాలాజీనగర్ వాటర్‌ట్యాంకు, 15వ డివిజన్ గొర్రెకుంట గ్రామ పంచాయతీ కార్యాలయంలోని కేంద్రాలను రాష్ట్ర శిశుసంక్షేమ శాఖ కమిషనర్, ఉమ్మడి వరంగల్ జిల్లా నోడల్ అధికారి వాకాటి కరుణ, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ రిజ్వాన్‌బాషా, వరంగల్ అదనపు కలెక్టర్ అశ్వినితానాజీవాకడేతో కలిసి పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
భారీగా తరలివస్తున్న ప్రజలు..
ఆరు గ్యారంటీ పథకాలకు సంబంఽధించి దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు భారీగా కేంద్రాలకు తరలివస్తున్నారు. ఎవరి చేతిలో చూసినా దరఖాస్తులు, జిరాక్స్ పత్రాలు కనిపిస్తున్నాయి. సెంటర్ల వద్దకు ఉదయం 8 గంటల వరకే చే రుకుంటున్నారు. దీంతో గ్రామ పంచాయతీ కార్యాలయాలు, కమ్యూనిటీహాళ్లు ప్రజలతో రద్దీగా మారుతున్నాయి.
● జిల్లా వ్యాప్తంగా 46.895
దరఖాస్తుల స్వీకరణ
● గ్రామ, వార్డు సభలకు
ప్రజల నుంచి విశేష స్పందన
● పరిశీలించిన నోడల్ అధికారి
వాకాటి కరుణ
Comments
Please login to add a commentAdd a comment