నేరాలు తగ్గుముఖం
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత ఏడాది కంటే 3.21 శాతం నేరాలు తగ్గాయని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వెల్లడించా రు. శనివారం ఉదయం పోలీస్ కమిషనరేట్‌లో సీపీ 2024 క్రైమ్ నివేదికను విడుదల చేశారు. ముందస్తు ప్రణాళికలు, పక్కా సమాచారంతో నేరాలను పూర్తిస్థాయిలో నియంత్రించినట్లు సీపీ ప్రకటించారు. 2023లో 14,731 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 14,406 కేసులు నమోదై 3.21శాతం తగ్గదల ఉన్నట్లు తెలిపా రు. హత్య కేసులు 16.67 శాతం, ఆస్తినేరాలు 2.23 శాతం తగ్గాయని వివరించారు. ముందస్తు చర్యల వల్ల 147 కేసుల్లో రూ.2.63 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సాక్ష్యాధారాలతో 2,462 మందికి వివిధ కేసుల్లో జైలుశిక్ష పడినట్లు తెలిపారు.
మావోయిస్టుల లొంగుబాటు..
సీపీ ఎదుట నలుగురు మావోయిస్టు పార్టీ నేతలు
లొంగిపోయారు.
● జూన్ 14న మావోయిస్టు పార్టీ ఏసీఎం తిక్క సుస్మిత లొంగిపోయింది. ఈమైపె రూ.4 లక్షల రివార్డును ప్రభుత్వం ప్రకటించింది. ఇదే రోజున మడకం దూల ఏసీఎం లొంగిపోయాడు. ఇతడిపై రూ. 4 లక్షల రివార్డు ఉంది.
● ఆగస్టు 29న బూజుగుండ్ల అనిల్, ఏసీఎం లొంగిపోయాడు. ఇతడిపై రూ. 4 లక్షల రివార్డును ప్రభుత్వం ప్రకటించింది.
● నవంబర్ 14న స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు కొడి మంజుల అలియాస్ నిర్మల్ లొంగిపోయింది. ఈమైపె రూ.20 లక్షల రివార్డును ప్రభుత్వం ప్రకటించింది.
కమిషనరేట్‌లో స్వల్పంగా (3.21 శాతం) తగ్గుదల
గత ఏడాదికంటే హత్యలు 16.67 శాతం, హత్యాయత్నాలు 17.06 శాతం లెస్
రోడ్డు ప్రమాదాలు 9.53 శాతం
రూ.2.63 కోట్ల గంజాయి స్వాధీనం
చోరీ సొత్తు రికవరీలో వెనుకబాటు
నేర వార్షిక నివేదిక విడుదల చేసిన సీపీ
Comments
Please login to add a commentAdd a comment