పూడికతీతకు రూ.11.16 కోట్లు
వరంగల్ అర్బన్: భద్రకాళి చెరువు పూడికతీతకు నిధుల కొరతపై ‘సాక్షి’ ప్రచురించిన వరుస కథనాలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. రూ. 11.16 కోట్ల నిధులను మంజూరు చేస్తూ శనివారం ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. చెరువు పూడికతీతకు మూడు విధానాలను నిర్ణయించింది. బ్లాక్ నెంబర్ 1, 2, 3 కోసం భద్రకాళి చెరువులో తవ్వకం, సిల్ట్‌ను లోడ్ చేయడానికి రూ.4.21 కోట్లు, బ్లాక్ 4, 5 కోసం చెరువులో తవ్వకం, పూడికను తరలించేందుకు రూ.6.95 కోట్లు కేటాయిస్తూ షరతులు విధించింది. వాస్తవ చెరువు కెపాసిటీ ఎంత? ట్యాంక్ ప్రస్తుత కెపాసిటీ, పూడిక, తదితర అంశాలపై ఇంజినీర్లు మార్గదర్శకాలను నిర్ధారించాలని సూచించింది. ఈ సందర్భంగా ప్రతీ 15 మీటర్ల వ్యవధిలో తొలగించాల్సిన పూడికతీతను లెక్కించాలని, క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ట్యాంక్ బెడ్‌లో ప్రతీ 50 నుంచి 100 మీటర్ల వ్యవధిలో ట్రయల్ పిట్‌లను నీటి వ్యాప్తి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఎఫ్‌టీఎల్, ట్యాంక్ స్లూయిస్ సిల్ట్ లెవల్ తదితర వివరాలను నమోదు తవ్వకాలు చేపట్టాలన్నారు. తవ్విన ప్రతీ క్యూబిక్ మీటర్ సిల్ట్‌కు రిజిస్టర్లు పక్కాగా ఉండాలని పేర్కొన్నారు.
పెన్షనర్లు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి
పరకాల: ఉద్యోగ విరమణ తర్వాత ఆరోగ్యంపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.గోపాల్‌రెడ్డి అన్నారు. పరకాలలోని పెన్షనర్లంతా ఐక్యంగా భవన నిర్మాణం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. పరకాల పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో శనివారం జాతీయ పెన్షనర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీనియర్, మహిళా పెన్షనర్లను సన్మానించారు. అనంతరం గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్‌లో ఇదే ఐక్యతను కొనసాగించాలని కాంక్షించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ పరకాల యూనిట్ అధ్యక్షుడు బండి ఆగయ్య, ఉపాధ్యక్షురాలు పగడాల సరళ, జాయింట్ సెక్రటరీ వెంకట్‌రెడ్డి, కోశాధికారి రామన్న, జనరల్ సెక్రటరీ ఆర్.వీరబ్రహ్మం, లింగమూర్తి, కె.సమ్మయ్య, రామదాసు, సారయ్య, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment