కొత్తకొండ జాతర ఏర్పాట్ల పరిశీలన
ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలం కొత్తకొండ జాతర ఏర్పాట్లను శనివారం దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ రామకృష్ణారావు పరిశీలించారు. కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో ప్రతీ సంక్రాంతికి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. జనవరి 10న స్వామివారి కల్యాణంతో ప్రారంభమయ్యే జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కొండపై నిర్మిస్తున్న మెట్ల మార్గం పనుల్ని పరిశీలించారు. ధ్యాన మండపం పనులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు భద్రకాళి సమేత వీరభద్రస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఆయన వెంట ఆలయ ఈఓ కిషన్‌రావు, ఆలయ అర్చకులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment