ఆదివారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
– 8లోu
ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకల్లో ఏ చిన్న దుర్ఘటన జరగకుండా బందోబస్తు నిర్వహించేందుకు పోలీస్‌శాఖ సిద్ధమవుతోంది. పోలీసులు ఎక్కడికక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తారు. అన్ని ప్రాంతాల్లో పకడ్బందీగా చర్యలు చేపడతారు. ప్రతీ ఏడాది డిసెంబర్ 31 వస్తుంది. జనవరి 1 వస్తుంది. ఇదే చివరిది కాదు. మొదటిది కాదు. ఎంజాయ్ పేరిట జీవితాలను ఆగం చేసుకోవద్దు..
ప్రశ్న: యువత నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం మత్తులో వాహనాలు వేగంగా నడిపి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? – మహేందర్ (ఎర్రగట్టుగుట్ట, హసన్‌పర్తి)
సీపీ: జీవితంలో డిసెంబర్ 31 అనేది చివరి రోజు కాదు. జనవరి 1 మొదటిది కాదు. ప్రతీ సంవత్సరం డిసెంబర్ 31 వస్తుంటుంది.. పోతుంటుంది. దానికి ఇదే చివరిది అనుకుని ఎంజాయ్ అనే పేరుతో జీవితాలను అంధకారం చేసుకోవద్దు. తల్లిదండ్రులు పిల్లలకు అర్ధరాత్రి పూట వాహనాలు ఇవ్వొద్దు. మద్యం సేవించిన తర్వాత అసలు ఇవ్వొద్దు. రోడ్లపై పోలీసులు వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్ని అడుగడుగునా నిర్వహిస్తారు. కాబట్టి అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు పడొద్దు.
ఫోన్‌లో మాట్లాడుతున్న సీపీ అంబర్ కిషోర్ ఝా
●
...అని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. డిసెంబర్ 31, నూతన సంవత్సర వేడుకల నిర్వహణలో పోలీస్ శాఖాపరంగా తీసుకుంటున్న చర్యలు, ప్రజలు శాంతియుతంగా జరుపుకునేందుకు పాటించాల్సిన జాగ్రత్తలపై శనివారం ‘సాక్షి’ ఫోన్ ఇన్ ప్రోగ్రాం నిర్వహించింది. వరంగల్ కమిషనరేట్ (వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలు) పరిధి ప్రజలు సీపీతో నేరుగా మాట్లాడి సందేహాలు నివృత్తి చేసుకున్నారు. వాటిలో ముఖ్యమైనవి ఇలా..
– వరంగల్ క్రైం
ప్రశ్న: డిసెంబర్ 31 సందర్భంగా గ్రామాల్లో కూడా యువకులు రోడ్లపై పెద్దగా అరుస్తూ బహిరంగంగా మద్యం సేవిస్తున్నారు. వీటిని కట్టడి చేస్తున్నారా?
– గంగారం సురేశ్ (నడికూడ), పి.ప్రశాంత్ (పరకాల)
సీపీ: బహిరంగంగా మద్యం సేవించడం చట్ట విరుద్ధం. అది గ్రామాల్లో అయినా.. పట్టణంలో అయినా నేరమే. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజాప్రతినిధులు, విలేజ్ పోలీస్ అధికారుల ద్వారా తెలియజేశాం. డిసెంబర్ 31 రాత్రి ప్రశాంత వాతావరణంలో ప్రజలంతా కలిసికట్టుగా వేడుకలు నిర్వహించుకోవాలి. ఎలాంటి వివాదాలకు తావు ఉండొద్దు.
ప్రశ్న: జనగామలోని బతుకమ్మ కుంట, మినీ స్టేడియం ప్రాంతంలో వేడుకల సందర్భంగా బందోబస్తు పెంచాలి? – యు.సందీప్ (జనగామ)
సీపీ: కచ్చితంగా అవసరం ఉన్న ప్రతీ చోట బందోబస్తు పెంచుతాం. పెట్రోలింగ్ నిర్వహిస్తాం. రాత్రి పూట మహిళలు దేవాలయాలు, చర్చీలకు ప్రార్థనల కోసం వెళ్లి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటాం. షీటీమ్స్ పోలీసులు మఫ్టీలో ఉంటారు.
ప్రశ్న: డిసెంబర్ 31, జనవరి 1 రోజున వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు మూసేస్తే బాగుంటుంది?
– శ్రీకాంత్ (హనుమకొండ)
సీపీ: వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వహణ బాధ్య త ఎకై ్సజ్ శాఖది. పోలీసులు కేవలం ఎన్‌ఫోర్స్‌మెంట్ చేస్తారు. డిసెంబర్ 31రోజున ఎకై ్సజ్ శాఖ రాత్రి 12 గంటల వరకు అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత ఎవరైనా నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం.
ప్రశ్న: డీజే సౌండ్స్‌తో ఇబ్బందులు పడుతున్నాం. వేడుకల పేరిట చాలా మంది రాత్రి నిద్ర లేకుండా చేస్తున్నారు. మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? – శ్రీనివాస్, (ఈఎస్‌ఐ ఆస్పత్రి ప్రాంతం, వరంగల్)
సీపీ: నూతన సంవత్సరం సందర్భంగా డీజేల నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేవు. రాత్రి పూట ఎక్కడ డీజే సౌండ్స్ పెట్టినా వాటిని స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. సంతోషం కోసం చిన్న చిన్న మ్యూజిక్ పెట్టుకోవచ్చు. ఎక్కడైనా ప్రజలు ఇబ్బందులు పడితే డయల్ 100కు సమాచారం ఇవ్వండి. పరిష్కారం లభిస్తుంది.
ప్రశ్న: ేస్నహితులు, బంధువులతో కలిసి పార్టీలు చేసుకోవడానికి అనుమతి తీసుకోవాలా? – రమేశ్ (హనుమకొండ)
కుమారస్వామి, సంగెం
సీపీ: ఎంత మంది కలిసి పార్టీ చేసుకుంటున్నారు? ఎలాంటి పార్టీ అనే విషయాలు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. వారు అనుమతి తీసుకుని ముందుకు సాగాలి. పార్టీల్లో డీజేలు పెట్టవద్దు, పార్టీలకు అనుమతి స్థానిక పోలీసుల పరిధిలోనే ఉంటుంది. ఎక్కువ మంది గ్యాదర్ అయితే ఏసీపీతో అనుమతి తీసుకోవాలి. ప్రజలంతా సంతోషంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి.
న్యూస్‌రీల్
ప్రశ్న: డిసెంబర్ 31న రాత్రి బందోబస్తుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?
– ఇసంపల్లి శంకర్ (క్రిస్టియన్ కాలనీ, వరంగల్), బంగారు భీంరావు (జనగామ), కరుణాకర్‌రెడ్డి, యాకంరెడ్డి, ఎ.శ్రీనివాస్ (బచ్చన్నపేట)
సీపీ: ట్రైసిటీ పరిధితోపాటు ఆయా మండల కేంద్రాల్లో డ్రంక్‌అండ్‌డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తాం. గ్రామాల్లో సైతం పెట్రోలింగ్ ఉంటుంది. మద్యం మత్తులో వాహనాలు నడిపే వ్యక్తుల నుంచి వాహనాలు స్వాధీనం చేసుకుంటాం. షీటీమ్స్ పోలీసులు మఫ్టీలో ఉంటారు. అన్ని స్థాయిల పోలీసులు దాదాపు జనవరి 1 ఉదయం 6 గంటల వరకు రోడ్లపైనే ఉంటారు. డీసీపీ స్థాయి వరకు అధికారులంతా బందోబస్తు పర్యవేక్షిస్తారు.
డిసెంబర్ 31 రాత్రి అడుగడుగునా పోలీసు పహారా
ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకుందాం..
వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన
పెట్రోలింగ్, బందోబస్తుపై ప్రశ్నించిన ప్రజలు సందేహాలు నివృత్తి చేసిన సీపీ
Comments
Please login to add a commentAdd a comment