చెక్కు అందించనందుకు మెమోలు | - | Sakshi
Sakshi News home page

చెక్కు అందించనందుకు మెమోలు

Published Fri, Nov 22 2024 1:05 AM | Last Updated on Fri, Nov 22 2024 1:05 AM

-

ఐనవోలు: ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న అర్చకుడితో పాటు మరో ముగ్గురు చిరుద్యోగులకు ఎండోమెంట్‌ అధికారి మెమోలు జారీ చేశారు. మల్ల న్న ఆర్చ్‌ నిర్మాణానికి ఇటీవల మల్లికార్జునస్వామి టీం రూ.1.5 లక్షలు చెక్కు రూపంలో ఆలయంలో అర్చకుడు నందనం మధు శర్మకు అందజేశారు. ఈవిషయం ‘సాక్షి’లో ప్రచురితమైంది. ఈనెల 17న ఆదివారం భక్తులు అర్చకుడికి చెక్కు ఇచ్చినప్పటికీ గురువారం సాయంత్రం వరకు ఎండోమెంట్‌ అధికారులకు చెక్కును అందజేయలేదు. దీంతో ఆలయంలో విధులు నిర్వహిస్తున్న అర్చకుడు నందనం మధుశర్మతో పాటు మరో ముగ్గురు చిరుద్యోగులు తిరుమలేశ్‌, ఎస్‌.రాజు, బి.కన్నయ్యకు ఈఓ అద్దంకి నాగేశ్వర్‌రావు మెమోలు జారీ చేసి వివరణ కోరినట్లు తెలిపారు. సమాచారం లేకుండా భక్తులు ఇచ్చిన చెక్కు ఎలా స్వీకరిస్తారని వారిని ప్రశ్నించారు. అనుమతి లేకుండా అర్చకులు, ఉద్యోగులు చెక్కులు, నగదు రూపంలో విరాళం తీసుకుంటే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement