డిమాండ్లు ఒప్పుకుంటేనే భూములిస్తాం
సంగెం: డిమాండ్లు ఒప్పుకుంటేనే గ్రీన్‌ఫీల్డ్ హైవేకు భూములు ఇస్తామని లేకుంటే ఇవ్వమని సంగెం మండల కేంద్రం భూనిర్వాసిత రైతులు తేల్చి చెప్పారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ సత్య శారద, ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డిని కలిసి వారు గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో రోడ్ల కోసం భూములు ఇచ్చి మిగిలిన భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నామని తెలిపారు. గ్రీన్‌ఫీల్డ్ హైవేలో భూములు పోతే ఎలా జీవించాలని ప్రశ్నించారు. భూమికి బదులు భూమి లేదా మార్కెట్ ధర ప్రకారం ఒకేసారి పరిహారం చెల్లించడంతోపాటు టోల్‌ట్యాక్స్‌లో నిర్వాసిత రైతులకు 70 శాతం చెల్లించడానికి ఒప్పుకుంటేనే తమ పంటభూములు ఇస్తామని స్పష్టం చేశారు. తమ భూముల్లో అలైన్‌మెంట్ సర్వే చేయనివ్వమని తేల్చిచెప్పారు. కార్యక్రమంలో భూ నిర్వాసిత రైతులు సోల మహేందర్, నూర సంపత్‌కుమార్, సత్తయ్య, శంకరయ్య, వెంకన్న, జి.మహేందర్, డి.యాకయ్య, కె. అయిలయ్య, నూర రాజమణి, రాధిక తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment