గొర్ల దొంగలు దొరికారు!
దామెర: జల్సాలకు అలవాటుపడి గొర్లు, మేకలను దొంగిస్తున్న బృంద సభ్యులను దామెర పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. పరకాల ఏసీపీ సతీశ్‌బాబు దామెర పోలీస్ స్టేషన్‌లో వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.. జయశంకర్ జిల్లా కొత్తపల్లి గోరి మండలంలోని నిజాంపల్లికి చెందిన బొమ్మ తిరుపతి, ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని చల్వాయికి చెందిన మల్ల భరత్, వరంగల్ మండలంలోని కొత్తపేటకు చెందిన వంగూరి మధు, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌కు చెందిన కొత్తకొండ వికాస్ గ్రూపుగా ఏర్పడి మొదట్లో చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు. అనంతరం కొత్తకొండ వికాస్ లాంగ్ డ్రైవ్ కోసం కార్లను తీసుకొని గొర్లు, మేకలను దొంగిలిస్తే ఎవరికీ అనుమానం రాదని మిగతా మిత్రులకు వివరించాడు. దీంతో లాంగ్ డ్రైవ్ కోసం కార్లను అద్దెకు తీసుకుని పలుచోట్ల గొర్లు, మేకలను దొంగిలించి హైదరాబాద్, వరంగల్ సంతల్లో అమ్మి వచ్చిన సొమ్ముతో ఎంజాయ్ చేసేవారు. ఈ క్రమంలో తిరుపతి, భరత్, వికాస్ ఈ నెల 9 తెల్లవారుజామున మండలంలోని కోగిల్వాయికి కారులో వచ్చి గొర్లను దొంగిలిస్తుండగా గ్రామానికి చెందిన జంగిలి రవి.. వికాస్‌ను గట్టిగా పట్టుకొని అరవడంతో వికాస్.. రవిపై రాయితో దాడిచేశాడు. ఆ తర్వాత కారును, సెల్ ఫోన్ వదిలి ముగ్గురు పారిపోయారు. దీంతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలో వదిలి వెళ్లిన కారును తీసుకెళ్లేందుకు నిందితులు శుక్రవారం గ్రామానికి రాగా.. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని తిరుపతి, భరత్, మధును అరెస్టుచేసి రూ.3 లక్షలు, 4 సెల్ ఫోన్లు, బెలోనో కారు సీజ్ చేసి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. కొత్తకొండ వికాస్ పరారీలో ఉండగా అతడిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. వీరిపై గతంలో 10 కేసులు నమోదు కాగా 63 జీవాలను దొంగతనం చేయగా వాటి విలువ సుమారు రూ.4,98,000 ఉంటుందని ఏసీపీ పే ర్కొన్నారు. సమావేశంలో పరకాల రూరల్ సీఐ రంజిత్ రావు, ఎస్సై అశోక్ తదితరులు ఉన్నారు.
వివరాలు వెల్లడించిన
పరకాల ఏసీపీ సతీశ్‌బాబు
Comments
Please login to add a commentAdd a comment