ఇటుక బట్టి కార్మికుల కూలి రేట్లు పెంచాలి
నర్సంపేట: పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇటుక బట్టి కార్మికుల కూలీ రేట్లు పెంచాలని ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు గంగుల దయాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణంలోని న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో బుధవారం బరిగెల కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో దయాకర్ మాట్లాడారు. కార్మికుల శ్రమను యా జమాన్యాలు గుర్తించకుండా తీవ్రమైన నిర్లక్శ్‌య వైఖరిని అవలంభిస్తూ వారు పని చేసే ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు మెరుగుపర్చడం లేదన్నారు. కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ నాయకులు గొర్రె ప్రదీప్, బ్రిక్స్ అండ్ ట్రాక్టర్ వర్కర్స్ యూనియన్ నాయకులు సంగి సురేశ్, చొప్పరి రాజు, దేవేందర్, కుమార్, చొప్పరి రమేశ్, రవి, భిక్షపతి, యోగేశ్వర్, రాంబాబు, శ్రీనివాస్, రమేశ్, నందం కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.
పెరిగిన ధరలకు అనుగుణంగా హమాలి కూలి రేట్లు పెంచాలని బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు మార్కెట్ ఖరీదు, ఫర్టిలైజర్ యూనియన్, ఐరన్ అండ్ మర్చంట్ యూనియన్ అధ్యక్షుడు వంగేటి గోవర్ధన్, దోమకుంట్ల సురేష్, బూర అశోక్‌లకు బుధవారం బీఆర్‌టీయూ, ఏఐటీయూసి అనుబంధ హమాలీ సంఘం ఆధ్వర్యంలో నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, హమాలీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొల్లూరి లక్ష్మినారాయణ, ఏఐటీయూసి జిల్లా నాయకుడు గుంపెల్లి మునీశ్వర్ మాట్లాడారు. ప్రతి రెండు సంవత్సరాలకు నూతన రేట్ల ఒప్పందం ఉంటుందని, డిసెంబర్ 21తో ఆ గడువు ముగుస్తుందన్నారు. నాయకులు గుండెబోయిన కొమురయ్య, నాగులు, చంద్రమౌళి, శ్రీనివాస్, రాములు, రమేష్, ఎలేందర్ పాల్గొన్నారు.
ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు దయాకర్
Comments
Please login to add a commentAdd a comment