నిట్‌లో క్రిస్మస్‌ వేడుకలు | - | Sakshi
Sakshi News home page

నిట్‌లో క్రిస్మస్‌ వేడుకలు

Published Sat, Dec 21 2024 1:06 AM | Last Updated on Sat, Dec 21 2024 1:06 AM

నిట్‌లో క్రిస్మస్‌ వేడుకలు

నిట్‌లో క్రిస్మస్‌ వేడుకలు

కాజీపేట అర్బన్‌: నిట్‌ క్యాంపస్‌లో శుక్రవారం నిట్‌మాస్‌–24 పేరిట క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిట్‌ క్రిస్టియన్‌ ఫెలోషిప్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఐఐటీ రూర్కీ ప్రొఫెసర్‌ పీఎస్‌.చానీ పాల్గొని మాట్లాడారు. ఏసు క్రీస్తు బోధనలను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలన్నారు. ఏసు ప్రభు బోధనలు, ఆటపాటలతో చిన్నారులు అలరించారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్‌ రిలేషన్‌ అండ్‌ అల్యూమ్ని అఫైర్స్‌ డీన్‌, ప్రొఫెసర్‌ శ్రీనివాసరావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు నైపుణ్యాలను

పెంపొందించుకోవాలి

హసన్‌పర్తి: ప్రస్తుత పోటీ ప్రపంచంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవా లని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు. నగరంలోని ఎస్‌వీఎస్‌ విద్యాసంస్థల్లో నిర్వహిస్తున్న ‘టెక్‌–క్వెస్ట్‌–24’ వేడుక ల్లో భాగంగా శుక్రవారం విద్యార్థులు ఫొటో ఎగ్జిబిట్స్‌, పోస్టర్లను ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీ మాట్లాడుతూ.. విద్యార్థుల ఆవిష్కరణలు అద్భుతంగా ఉన్నాయని, వారిలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీయాలని చెప్పారు. ఈ సందర్భంగా నార్కొటిక్‌ తెలంగాణ కంట్రోల్‌ బ్యూరో ఆధ్వర్యాన ఎంపవర్డ్‌ యూత్‌, డ్రగ్స్‌, సైబర్‌ క్రైంపై అవగా హన కల్పించారు. అంతకు ముందు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఎస్‌వీఎస్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ ఎర్రబెల్లి తిరుమల్‌రావు, ట్రెయినీ ఐపీఎస్‌ మన్నాన్‌ భట్‌, ఏసీపీ దేవేందర్‌రెడ్డి, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌తదితరులు పాల్గొన్నారు.

దైవ దర్శనానికి

ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

హన్మకొండ: ఇష్ట దైవాల దర్శనానికి వెళ్లే భక్తు ల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడుపుతున్న ట్లు టీజీఎస్‌ ఆర్టీసీ వరంగల్‌ రీజినల్‌ మేనేజర్‌ డి.విజయభాను తెలిపారు. వరంగల్‌–2 డిపో ద్వారా భక్తులతో అరుణాచలం వెళ్తున్న ఆర్టీసీ ప్రత్యేక బస్సును హనుమకొండ బస్‌ స్టేషన్‌లో ఆర్‌ఎం డి.విజయ భాను శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆర్‌ఎం మాట్లాడుతూ.. భక్తుల కోరిక మేరకు ప్రత్యేక బస్సులు సమకూరుస్తున్నామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్‌ మేనేజర్‌ కేశరాజు భానుకిరణ్‌, డిపో మేనేజర్‌ జ్యోత్స్న, అసిస్టెంట్‌ మేనేజర్లు పాల్గొన్నారు.

ఆర్టీసీలో మర్యాద దినోత్సవం

హన్మకొండ: హనుమకొండ జిల్లా బస్‌స్టేషన్‌లో శుక్రవారం మర్యాద దినోత్సవం నిర్వహించారు. మహిళా ప్రయాణికురాలిని ఆర్టీసీ వరంగల్‌ రీజినల్‌ మేనేజర్‌ డి.విజయభాను సన్మానించారు. ఈసందర్భంగా ఆర్‌ఎం మాట్లాడు తూ.. ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు ప్రయాణికుల పట్ల మర్యాదగా ఉండాలన్నారు. ప్ర యాణికులను సంస్థ గౌరవిస్తోందని చెప్పారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్‌ మేనేజర్‌ ఆపరేషన్‌ కేశరాజు భానుకిరణ్‌, వరంగల్‌–2 డిపో మేనేజర్‌ జ్యోత్స్న, వరంగల్‌–1 డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌ సంతోశ్‌, సూపర్‌వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

రెగ్యులర్‌ కోర్సులుగా

మార్చేందుకు కృషి : వీసీ

కేయూ క్యాంపస్‌: కేయూ మహిళా ఇంజనీరింగ్‌ కళాశాలలోని ఎస్‌ఎఫ్‌సీ కోర్సులను రెగ్యులర్‌ కోర్సులుగా మార్చేందుకు కృషి చేస్తానని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రతాప్‌రెడ్డి అన్నారు. కేయూలోని మహిళా ఇంజనీరింగ్‌ కళాశాలను శుక్రవారం సందర్శించిన వీసీ.. తరగతుల గదుల్లోకి వెళ్లి పరిశీలించి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం కళాశాల ప్రిన్సి పాల్‌ డాక్టర్‌ బిక్షాలుతో మాట్లాడగా.. కళాశాలకు ఇంకా అధ్యాపకులు అవసరమని, ల్యాబ్‌ సదుపాయాలతోపాటు మౌలిక వసతులు కల్పించాలని వీసీ దృష్టికి తీసుకెళ్లారు. అనంత రం కళాశాల ఆవరణలో వీసీ మొక్క నాటారు. ఆయన వెంట రిజిస్ట్రార్‌ ఆచార్య పి.మల్లారెడ్డి ఉన్నారు. అనంతరం ఎస్‌డీఎల్‌సీఈని రిజిస్ట్రార్‌ మల్లారెడ్డితో వీసీ సందర్శించి డైరెక్టర్‌ రాంచంద్రంతో మాట్లాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement