ఆరోగ్యపరంగా చాలా నష్టం..
పెళ్లి వయస్సు రాకుండా వివాహం చేయడం వల్ల అమ్మాయిలైనా, అబ్బాయిలైనా చాలా కష్టనష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక, శారీరక పరిపక్వత లేకపోవడం మూలంగా అనేక సమస్యలు తలెత్తుతాయి. స్వతహాగా ఎదుర్కోలేక మానసికంగా కుంగిపోతారు. చిన్న వయస్సులో బాలికలకు గర్భ సంచి ఎదగదు. ఇలాంటి పరిస్థితుల్లో గర్భం దాలిస్తే గర్భస్రావం జరిగే అవకాశం ఉంటుంది. పుట్టిన పిల్లలు కూడా బరువు తక్కువగా, తరచూ అనారోగ్యం బారిన పడతారు. తల్లిదండ్రులు ఈ విషయంలో పొరపాటు చేయవద్దు.
–డాక్టర్ నరేశ్ కుమార్, రాష్ట్ర వైద్యమండలి సభ్యుడు
వివాహ నమోదు తప్పనిసరి చేయాలి..
జనన, మరణ తేదీల నమోదు మాదిరిగానే వధూవరుల వయసు, పాఠశాల, ఆస్పత్రి రికార్డులను పరిశీలించి మేజరైతేనే ముహూర్తం పెట్టేలా బ్రాహ్మణులు చర్యలు తీసుకోవాలి. పెళ్లి నమోదు రికార్డులను సంబంధిత అధికారులకు అప్పగించేలా చూస్తే చాలావరకు బాల్యవివాహాలను కట్టడి చేయవచ్చు. గ్రామాల్లో ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు ప్రతిఒక్కరూ వీటిని నిరోధించేందుకు కృషి చేయాలి. బాల్యవివాహం జరిపితే రెండేళ్ల జైలు శిక్ష లేదా లక్ష రూపాయల వరకు జరిమానా లేదంటే రెండూ ఒకేసారి విధించే వీలుంది.
–మండల పరశురాం, సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్, ఉమ్మడి వరంగల్
●
Comments
Please login to add a commentAdd a comment