ఆరో వార్డుకు తాగునీటి సరఫరా
శాయంపేట : మండల కేంద్రంలోని ఆరో వార్డుకు తాగునీటిని సరఫరా చేశారు. ఈ వార్డులో మూడు నెలలుగా తాగునీటి కొరత తలెత్తడంతో మహిళలు గురువా రం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళ న చేపట్టారు. ఈనేపథ్యంలో ‘తాగునీటి కోసం మహిళల నిరసన’ శీర్షికన సాక్షిలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు రూ.40వేల విలువైన మోటారు పంపింగ్ సెట్టు కొనుగోలు చేశారు. ఎంపీఓ రంజిత్‌కుమార్, పంచా యతీ కార్యదర్శి మడికొండ రత్నాకర్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల పర్యవేక్షణలో పంపు ఆపరేటర్‌తో మోటారు బిగించి తాగునీటిని సరఫరా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment