యాసంగికి ఎరువుల కొరత లేదు
చెన్నారావుపేట: యాసంగి సాగుకు ఎరువుల కొరత లేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ అన్నారు. ఈ మేరకు మండలంలోని సొసైటీల పరిధిలోని ఉప్పరపల్లి, చెన్నారావుపేట, అమీనాబాద్, లింగగిరి ఎరువుల గోదాముల మంగళవారం ఆకస్మీకంగా తనిఖీ చేశారు. రైతులకు కావాల్సిన ఎరువులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. రైతులు కూడా మోతాదుకు మించి ఎరువులు తీసుకెళ్లందన్నారు. అవసరం మేరకు ఎరువులు తీసుకెళ్లాలన్నారు. నిల్వ చేసినట్లయితే గడ్డకట్టి పనికి రాకుండా పోతుందన్నారు. అనంతరం స్టాక్ రిజిస్టర్‌లు పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. నకిలీ విత్తనాలు, పురుగుల మందులు విక్రయించిన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గోపాల్‌రెడ్డి, ఏఈఓ తిరుపతి, సిబ్బంది రాఘవులు, రమేశ్, వీరస్వామి, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment