పవర్ లిఫ్టింగ్‌లో బంగారు పతకాలు
కాజీపేట రూరల్: కాజీపేటకు చెందిన ముగ్గు రు పవర్‌లిఫ్టర్లు ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన పవర్ లిఫ్టింగ్ బెంచిప్రెస్ ఛాంపియన్‌షిప్–25 పోటీలో గోల్డ్‌మెడల్స్ సాధించారు. కాజీపేట కడిపికొండ రాంనగర్‌కు చెందిన ఎండి.జాఫర్ 59 కిలోల విభాగంలో ప్రథమ స్థానం, కాజీపేట సోమిడికి చెందిన దామెరుప్పుల మొగిళి 54 కిలోల విభాగంలో ప్రథమ స్థానం, కడిపికొండ రాంనగర్‌కు చెందిన కుక్కల ఉమాసాయి 105 కిలోల కేటగిరిలో ఐదో స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించారు. వీరిలో పవర్ లిఫ్టర్ జాఫర్ అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. మే నెలలో ఆస్ట్రేలియాలో జరిగే ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొననున్నట్లు జాఫర్ తెలిపారు. కాగా.. ఈ ముగ్గురిని మంగళవారం కాజీపేట ఆర్‌పీఎఫ్ పోలీస్‌స్టేషన్‌లో కాజీపేట ఆర్‌పీఎఫ్ సీఐ,నేషనల్ ప్లేయర్ ఎం. సంజీవరావు సత్కరించారు.
పీజీ కోర్సుల మొదటి
సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్: ఈనెల 20 నుంచి పీజీ కోర్సు ల మొదటి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య బీఎస్‌ఎల్ సౌజన్య తెలిపా రు. కేయూలోని పీజీ కోర్సులైన ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్‌ఆర్‌ఎం, ఎంఎల్‌ఐఎస్సీ కోర్సుల (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్‌మెంట్) మొదటి సంవత్స రం మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20, 22, 24, 27, మార్చి 1, 3 తేదీల్లో పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
నిట్ నూతన రిజిస్ట్రార్‌గా
సుశీల్‌కుమార్ మెహతా
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ నూత న రిజిస్ట్రార్‌గా సుశీల్‌కుమార్ మెహతా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్వీ.ఉమామహేశ్ నుంచి సుశీల్‌కుమార్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీని మార్యదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా నూ తన రిజిస్ట్రార్‌ను ఆయన అభినందించారు.
క్యాన్సర్ నివారణకు
కృషి చేయాలి
దామెర: క్యాన్సర్ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎం.సాయికుమార్ అన్నారు. మంగళవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని ప్రతిమ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాధిగ్రస్తులు భయపడకుండా క్యాన్సర్‌ను జయించేందుకు కృషి చేయాలన్నారు. శుచి కలిగిన భోజనం, శారీరక శ్రమతో క్యాన్సర్‌ను దూరం చేయొచ్చని సూచించారు. అవగాహనతో నియమ నిబంధనలు పాటిస్తే క్యాన్సర్‌ను ఎదుర్కోవచ్చన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆస్పత్రిలోని వ్యాధిగ్రస్తులతో మాట్లాడి వారిలో ధైర్యం నింపుతూ.. పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సాంబశివరావు, ప్రతిమ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ అవినాశ్ తిప్పని, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
41 కిలోల గంజాయి పట్టివేత
పరకాల: టాస్క్‌ఫోర్స్ సమాచారంతో పరకాల పోలీసులు ఒడిశాకు చెందిన ఇద్దరు ప్రేమందా దాస్, అతడి బావమరిది సౌమ్య రంజన్‌రౌత్ నుంచి రూ.10,27,250 విలువైన 41 కిలోల ఎండు గంజాయిని మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. పరకాల–హనుమకొండ రోడ్డులో పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో.. ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారి నుంచి నాలుగు బ్యాగులు స్వాధీ నం చేసుకొని తనిఖీ చేయగా.. గంజాయి పట్టుబడింది. ప్రేమందా దాస్, సౌమ్య రంజన్‌రౌత్‌పై కేసు నమోదు చేసినట్లు పరకాల సీఐ క్రాంతికుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment