పనులు త్వరగా పూర్తి చేయండి
ఎల్కతుర్తి: మండల కేంద్రంలో జరుతున్న అభివృద్ధి, జంక్షన్ సుందరీకరణ పనుల్ని కలెక్టర్ పి.ప్రావీణ్య మంగళవారం పరిశీలించారు. ఎల్కతుర్తి మండల కేంద్రాన్ని సందర్శించిన ఆమె బస్టాండ్ సమీపంలో జరుగుతున్న అభివృద్ధి, జంక్షన్ సుందరీకరణ పనులు మార్చి మొదటి వారం వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సోలార్ ప్లాంట్ ఏర్పాటు కోసం స్థానిక, సూరారం శివారు ప్రాంతంలోని ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. ఎల్కతుర్తి, సూరారం శివారులో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల రిజిస్టర్‌ను పరిశీలించారు. మందుల స్టాక్ వివరాలు, బీపీ, శుగర్ మందులు అందుబాటులో ఉన్నాయా అని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా పీహెచ్‌సీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాట్లాడారు. కాన్సర్‌ను మొదటి దశలో గుర్తిస్తే ఆ వ్యాధిని చికిత్స ద్వారా నయం చేయవచ్చన్నారు. ప్రజలకు ప్రభుత్వాస్పత్రిలో క్వాలిటీ (నాణ్యమైన) మందులు లభిస్తున్నాయనే విషయాన్ని వారికి నమ్మకం కలిగేలా ఎప్పటికప్పుడు అవేర్నెస్(అవగాహన) కల్పించాలని సిబ్బందికి ఆదేశించారు. కార్యక్రమంలో ఆమె వెంట ‘కుడా’ వైస్ చైర్మన్ అశ్విని తానాజీ వాకడే, ఆర్డీఓ రమేశ్‌రాథోడ్, డీఆర్డీఏ శ్రీనివాస్, డీఎంహెచ్‌ఓ అప్పయ్య, డీఎం మహేందర్‌రెడ్డి, డీపీఎం ప్రకాశ్, తహసీల్దార్ జగత్‌సింగ్, ఎంపీడీఓ విజయ్‌కుమార్, ఏపీఎం రవీందర్, ఐకేపీ సిబ్బంది, వైద్య సిబ్బంది తదితర మహిళలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రావీణ్య..
ఎల్కతుర్తి జంక్షన్ సుందరీకరణ
పనుల పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment