ఎక్కువ పనిదినాలు కల్పిస్తాం
● కలెక్టర్ ప్రావీణ్య
హసన్‌పర్తి: ఉపాధి హామీ కూలీలకు ఎక్కువ పనిదినాలు కల్పిస్తామని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. హసన్‌పర్తిలోని సంస్కృతీ విహార్‌లో మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం 20వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ ప్రావీణ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మా ట్లాడుతూ కమ్యూనిటీ పరంగా ఉపయోగపడే పనులు చేపట్టాలని సూచించారు. ఉపాధి పనులు ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సర్వే కార్యక్రమం తక్కువ సమయంలో పూర్తి చేయడాన్ని కలెక్టర్ అభినందించారు. ఈసందర్భంగా తమకు మూడు నెలల నుంచి వేతనాలు అందట్లేదని, వెంటనే విడుదల చేయించాలని సిబ్బంది కోరారు. విశిష్ట సేవలు అందించిన హసన్‌పర్తి ఎంపీడీఓ కర్ణాకర్‌రెడ్డిని సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment