పలు రైళ్లకు ఎక్స్‌పర్మెంటల్ హాల్టింగ్
● 5 రైల్వే స్టేషన్లలో 10 రైళ్లకు..
కాజీపేట రూరల్ : కాజీపేట సబ్ డివిజన్ పరిధి లోని పలు రైల్వే స్టేషన్లలో పలు రైళ్లకు ఎక్స్‌పర్మెంటల్ హాల్టింగ్ కల్పిస్తున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. ఆయా రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం కొనసాగుతున్న రైళ్లకు ప్రయోగత్మకమైన హాల్టింగ్ మరో 6 నెలల పాటు పొడగించినట్లు తెలిపారు.
హాల్టింగ్ కల్పించిన రైళ్లు ఇవే..
వరంగల్‌లో ఫిబ్రవరి 8వ తేదీ నుంచి చైన్నె సెంట్రల్–హజ్రత్‌నిజాముద్దీన్ (12611) ఎక్స్‌ప్రెస్, బెల్లంపల్లిలో ఫిబ్రవరి 5వ తేదీ నుంచి హజ్రత్‌నిజాముద్దీన్–తిరుపతి (12708) ఎక్స్‌ప్రెస్, ఖమ్మంలో ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ఎర్నాకులం–పాట్నా (22669) పాట్నా ఎక్స్‌ప్రెస్, పెద్దపల్లిలో ఫిబ్రవరి 4 తేదీ నుంచి చైన్నె సెంట్రల్–అహ్మదాబాద్ (12656) నవజీవన్ ఎక్స్‌ప్రెస్, ఫిబ్రవరి 3వ తేదీ నుంచి అహ్మదాబాద్–చైన్నె సెంట్రల్ (12655) నవజీవన్ ఎక్స్‌ప్రెస్, ఫిబ్రవరి 4వ తేదీ నుంచి సికింద్రాబాద్–హిసర్ (22737) ఎక్స్‌ప్రెస్, ఫిబ్రవరి 6వ తేదీ నుంచి హైదరాబాద్–రక్సోల్ (17006) రక్సోల్ ఎక్స్‌ప్రెస్, ఫిబ్రవరి 9వ తేదీ నుంచి రక్సోల్–హైదరాబాద్ (17005) రక్సోల్ ఎక్స్‌ప్రెస్, నెక్కొండలో ఫిబ్రవరి 4వ తేదీ నుంచి సికింద్రాబాద్–గుంటూరు(12706) ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, గుంటూరు–సికింద్రాబాద్ (12705) ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లకు 6 నెలల పాటు ఎక్స్‌పర్మెంటల్ హాల్టింగ్ కల్పించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment