హన్మకొండ: హనుమకొండ జిల్లాలో భూగర్భ జలాలు ప్రతి నెలా పడిపోతున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లో పెరిగిన భూగర్భ జలాలు నవంబర్ నుంచి తగ్గుముఖం పట్టాయి. సెప్టెంబర్‌లో 2.94 మీటర్ల లోతున ఽభూగర్భ జలమట్టం ఉండగా.. నవంబర్ నెలాఖరుకు 4.16 మీటర్లకు, డిసెంబర్ మాసాంతానికి 4.81 మీటర్లకు జనవరి మాసాంతానికి 5.93 మీటర్ల లోతుకు పడిపోయింది. అక్టోబర్ తర్వాత వర్షాలు లేక పోవడంతో పాటు నవంబర్ నుంచి యాసంగి వ్యవసాయ పనులు మొదలవడంతో భూగర్భ జలాల వినియోగం పెరిగింది. దీంతో భూగర్భ జలమట్టం పడిపోతోంది. ఈమాసాంతంలో అత్యధికంగా ఐనవోలులో 20.30 మీటర్లకు, నడికూడ మండలం చెర్లపల్లిలో 12.28 మీటర్లకు జలమట్టం పడిపోయింది. ప్రతీ నెల చివరి వారంలో భూగర్భ జల మట్టాలను భూగర్భ జలశాఖ నమోదు చేస్తోంది. హనుమకొండ జిల్లాలో ప్రత్యేకంగా బోరుబావులు తవ్వించి 25 ఫీజో మీటర్లు ఏర్పాటు చేశారు. ఈఫీజో మీటర్లు భూగర్భ జల మట్టాన్ని రికార్డు చేస్తున్నాయి. వీటి నుంచి భూగర్భజలశాఖ అధికారులు నీటిమట్టాన్ని రికార్డును సేకరిస్తారు.
నీటి మట్టం ఇలా..
గట్ల నర్సింగాపూర్‌లో 4.49 మీటర్ల లోతులో భూగర్భ జలాలున్నాయి. జగన్నాథపూర్‌లో 8.86, కొత్తపల్లిలో 7.55, వంగరలో 8.25, ధర్మసాగర్ మండలంలో ధర్మాపూర్‌లో 3.15, ధర్మసాగర్‌లో 2.48, పెద్ద పెండ్యాలలో 7.85. నారాయణగిరిలో 3.47, ఎల్కతుర్తిలో 7.64, హనుమకొండలో 5.30, హసన్‌పర్తి మండలం నాగారంలో 7.10, సీతంపేటలో 3.39, ఎల్లాపూర్‌లో 3.50, ఐనవోలు మండలం పున్నేలులో 3.35, పంథినిలో 4.55, ఐనవోలులో 20.30, కమలాపూర్ మండలం శనిగరంలో 5.90, పీచరలో 7.94, వేలేరులో 2.89, ఆత్మకూరులో 2.54, దామెరలో 3.50, నడికూడ మండలం చర్లపల్లిలో 12.28, నడికూడలో 2.58, పరకాలలో 3.86, శాయంపేట మండలం పత్తిపాకలో 4.62 మీటర్ల లోతులో భూగర్భజలాలున్నాయి.
జిల్లా సగటు భూగర్భజలం 5.93 మీటర్లు
Comments
Please login to add a commentAdd a comment