![ఉపాధి పనుల బకాయిలు విడుదల చేయాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06ety001-330099_mr-1738870532-0.jpg.webp?itok=-A5vAu-q)
ఉపాధి పనుల బకాయిలు విడుదల చేయాలి
ఎల్కతుర్తి: ఉపాధిహామీ పనుల బకాయిలను వెంటనే విడుదల చేసి పేదవారిని ఆదుకోవాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయ చైర్మన్ చంద్రశేఖర్ గుప్త తల్లి ఇటీవలే మృతి చెందగా.. కొత్తపల్లికి చేరుకొని బాధిత కుటుంబానికి సంతాపం తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చాడ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీ జనాభా జనగణనను విడుదల చేసి ప్రజల్లో నెలకొన్న అపోహాలను దూరం చేయాలన్నారు. సమావేశంలో ఆయన వెంట సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఆదరి శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉట్కూరి రాములు, కర్రె లక్ష్మణ్, రామచంద్రారెడ్డి, కుమారస్వామి తదితరులు ఉన్నారు.
నేడు ప్రభుత్వ సంగీత
కళాశాల స్వర్ణోత్సవాలు
నయీంనగర్: విద్యారణ్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల వరంగల్ స్వర్ణోత్సవాలు శుక్రవారం హనుమకొండ బాలసముద్రం కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.సుధీర్‌కుమార్ తెలిపారు. గురువారం హనుమకొండ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వర్ణోత్సావాల్లో భాగంగా సద్గురు శ్రీత్యాగరాజ స్వామి పంచరత్న కీర్తనల గోష్ఠిగానం, 10 ఆశ్రయ రాగాల ప్రదర్శన, పాల్గొన్న కళాకారులకు సన్మానం, సర్టిఫికెట్ ప్రదానం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, భద్రకాళి ఆలయ చైర్మన్ బండారి శేషగిరిరావు హాజరవుతారని తెలిపారు.
సెగ్రిగేషన్‌పై అవగాహన కల్పించాలి
వరంగల్: తడి, పొడి చెత్తను వేరుగా అందించడంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. హనుమకొండలోని మున్సిపల్ గెస్ట్‌హౌస్‌లో నిర్వహిస్తున్న సెగ్రిగేషన్ (తడి పొడి చెత్తను వేరు చేయడం) కంపోస్ట్ యూనిట్లను కమిషనర్ గురువారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment