విద్యార్థులు ప్రతిభ చాటాలి
కలెక్టర్ ప్రావీణ్య
విద్యారణ్యపురి: విద్యార్థులు చదువులో ప్రతిభ చాటాలని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. గురువారం సాయంత్రం హనుమకొండ రెడ్డి కాలనీలోని తెలంగాణ ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహాన్ని కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మికంగా తనిఽఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న భోజనాన్ని పరిశీలించారు. అందుతున్న వసతుల గురించి విద్యార్థులను, కళాశాలలో సమస్యలను బీసీ వెల్ఫేర్ డీడీ రామ్‌రెడ్డిని, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పుష్పరాణిని అడిగి తెలుసుకున్నారు. కళాశాల వసతి గృహం ప్రాంతంలో బస్సులు ఆపాలని విద్యార్థినులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆర్టీసీ అధికారులతో మాట్లాడతానని ఆమె హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్య విద్యార్థులలతో కలిసి భోజనం చేశారు. ఆమె వెంట అసిస్టెంట్ బీసీ వెల్పేర్ ఆఫీసర్ లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.
‘డీట్’లో నమోదు చేసుకోవాలి..
కాజీపేట అర్బన్: యువతకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్చేంజ్ ఆఫ్ తెలంగాణ(డీట్)లో నమోదు చేసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆండ్రాయిడ్ ఫోన్‌లో డీట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని సేవలు వినియోగించుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment