రోగులకు మెరుగైన వైద్యం అందించండి
ఆత్మకూరు: క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు, బాలింతలకు, గర్భిణులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య అన్నారు. గురువారం నీరుకుళ్ల, ఆత్మకూరు, గుడెప్పాడ్ గ్రామాల్లోని ఆరోగ్య ఉప కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలింతల ఇంటికి వెళ్లి అందుతున్న వైద్య సేవలు గురించి తెలుసుకున్నారు. అనంతరం ఆయన ప్రభుత్వాస్పత్రిలో ప్రసవాలు జరిగేలా అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు. అసంక్రమిత వ్యాధులపై అవగాహన కల్పించాలని కోరిన ఆయన ఇటీవల నీరుకుళ్ల గ్రామానికి చెందిన ఆశావర్కర్ పూలమ్మ గాయపడగా.. పరామర్శించి సహాయం అందజేశారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి స్పందన, సూపర్‌వైజర్ సంపత్, ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య
Comments
Please login to add a commentAdd a comment