![ఉప్పల్‌ను మండలం చేయాలని రాస్తారోకో](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06ety101-330100_mr-1738870533-0.jpg.webp?itok=WjDatzT7)
ఉప్పల్‌ను మండలం చేయాలని రాస్తారోకో
కమలాపూర్: కమలాపూర్ మండలం ఉప్పల్‌ను మండలంగా ప్రకటించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈమేరకు మండల సాధన సమితి ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు, గ్రామస్తులు కలిసి గురువారం మహాధర్నా నిర్వహించారు. ఉప్పల్‌లోని కన్నూరు క్రాస్ రోడ్డు వద్ద హుజూరాబాద్–పరకాల ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈసందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. ఏడాదిన్నరగా ఉప్పల్ మండలం కోసం ఉద్యమిస్తున్నామని, ఉప్పల్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న పది గ్రామాలను కలుపుకొని మండలం కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మండల సాధన కోసం ఆమరణ నిరాహార దీక్షకై నా సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తామన్నారు. పోలీసులు బలవంతంగా గ్రామస్తులతో ఆందోళనను విరమింపజేశారు. కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు సంపత్‌రావు, దేవేందర్‌రావు, నాయకులు శ్రీధర్‌రావు, తోట సురేశ్, క్రాంతికుమార్, రాజు, రాణాప్రతాప్, రాజమౌళి, రాంచంద్రం, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment