![ఎన్నికలకు సిద్ధం కావాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06ety002-330099_mr-1738870532-0.jpg.webp?itok=NhXpSo7c)
ఎన్నికలకు సిద్ధం కావాలి
ఎల్కతుర్తి: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ నాయకులకు పిలుపునిచ్చారు. గురువారం భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని వెంకటసాయి గార్డెన్, ఎల్కతుర్తి మండలంలోని ఎస్‌ఎమ్‌ఆర్ గార్డెన్‌లో బీఆర్‌ఎస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆయా సమావేశాలకు ముఖ్య అతిఽథిగా హాజరైన సతీశ్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. అవకాశం రాలేదని ఎవ్వరూ బాధపడొద్దని, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నందున అవకాశాలు కచ్చితంగా వస్తాయన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ శ్రేణులను బలపర్చేందుకు కృషి చేయాలన్నారు. కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉండి ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకొని వారికి అండగా నిలువాలని అలాగే పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాయకులంతా సమన్వయంతో పని చేసి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కృషి చేయాలన్నారు. రానున్న రోజుల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఇటీవల మృతి చెందిన కుటుంబాలను ఆయన పరామర్శించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మండల సురేందర్, పిట్టల మహేందర్, వంగ రవీందర్, సంగ సంపత్, మాజీ ఎంపీపీలు మేకల స్వప్న, జక్కుల అనితరమేశ్, మారుపాటి మహేందర్‌రెడ్డి, గోల్లె మహేందర్, తంగెడ మహేందర్, శ్రీపతి రవీందర్‌గౌడ్, తంగెడ నగేశ్, సాతూరి చంద్రమౌళి, గుండా ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్
నాయకులతో సన్నాహక సమావేశం
Comments
Please login to add a commentAdd a comment