చక్రాయిగూడెంలో కోడిపందేలరాయుళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
పెదవేగి: కోడిపందేల స్థావరంపై దాడి చేసిన పోలీసులు 27 మందిని అదుపులోకి తీసుకున్నారు. పెదవేగి ఎస్సై ఎం.లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. చక్రాయగూడెం గ్రామంలో కోడిపందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ధనరాజు, ఎస్‌ఈబీ ఇన్స్‌పెక్టర్ ప్రసాద్ కుమార్, ఏలూరు ఎస్‌ఈబీ ఇన్స్‌పెక్టర్ శ్రీనివాస రెడ్డి, ఎస్‌ఐ సుబ్బారెడ్డి దాడులు చేసి 27 మందని అదుపులోనికి తీసుకున్నారు. వారి నుంచి రూ.90,000 నగదు, 26 కోడిపుంజులు, 38 కార్లు, 70 మోటార్ సైకిళ్లు, 34 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment