పెద్దరావిగూడెం పాఠశాల పరిశీలన
కుక్కునూరు: మండలంలోని పెద్దరావిగూడెంలోని ఎంపీయూపీ పాఠశాలను శుక్రవారం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌టీవీ శ్రీనివాస్ పరిశీలించారు. శ్రీనివాస్ స్వగ్రామం పెద్దరావిగూడెం కావడంతో ఇక్కడకు వచ్చిన ఆయన పాఠశాలను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాలలో మౌలిక వసతులపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతుల కల్పనకు తక్షణ సాయం కింద చెక్కు అందించారు. ప్రధానోపాధ్యాయుడు, సర్పంచ్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు ప్రధాన న్యాయమూర్తిని సత్కరించి మెమెంటో అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment