పరుగు పరీక్షలో అభ్యర్థినులు
ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. శుక్రవారం ఏలూరు పరేడ్ గ్రౌండ్స్‌లో మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ దగ్గరుండి పర్యవేక్షించారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో 490 మంది మహిళా అభ్యర్థులకు 242 మంది హాజరయ్యారని, వారిలో 102 మంది ఎంపికై నట్టు ఎస్పీ చెప్పారు. అభ్యర్థులకు పరుగు, లాంగ్‌జంప్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించారు.
జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పరీక్షల నిర్వహణలో ఉన్నారు. – ఏలూరు టౌన్
Comments
Please login to add a commentAdd a comment