ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడదాం
కాళ్ల: కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, వైఎస్సార్‌సీపీకి వెన్నెముకగా సోషల్ మీడియా ఉండాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కారు మూరి నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని పెదఅమిరంలోని పార్టీ కార్యాలయంలో సోషల్ మీడియా జిల్లా సమావేశాన్ని సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు బందన పూర్ణచంద్రరావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు సోషల్ మీడియా కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండించారు. గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలపై చర్చించారు. కార్యకర్తలకు సముచితస్థానం కల్పిస్తామన్నారు. పూర్ణచంద్రరావు నేతృత్వంలో జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు, మండలాల్లో సోషల్ మీడి యా కన్వీనర్లను ఏర్పాటుచేస్తామన్నారు. కార్యకర్తల కోసం లీగల్ సెల్ తరఫున జిల్లా కార్యాలయంలో ఒక అడ్వకేట్‌ను కూడా నియమిస్తామన్నారు. ప్రజల పక్షాన సోషల్ మీడియా పనిచేయాలని కోరారు. పార్టీ చేస్తున్న పోరాటాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో జిల్లాలో మొదటి సమావేశం ఏర్పాటుచేస్తామని చెప్పారు. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా బాగా పనిచేస్తుండటంతో కూటమి ప్రభుత్వం భయపడుతోందని, అందుకే అణగదొక్కాలని కేసు లు పెడుతోందని ముదునూరి అన్నారు.
సోషల్ మీడియా అంటే ప్రభుత్వానికి హడల్
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్సార్‌సీ సోషల్ మీడియా అంటే కూటమి ప్రభుత్వానికి హడల్ అన్నారు. అబద్ధాలు చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. సూపర్ సిక్స్ అమలు చేయడానికి సీఎం చంద్రబాబు భయపడుతున్నారన్నారు. ఈవీఎంల ఎమ్మెల్యేలు, ఈవీఎంల ముఖ్యమంత్రిని చూసి ఎవరూ భయపడవద్దని, సోషల్ మీడియా కార్యకర్తల కోసం అధినేత జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. ఎవరికి ఏకష్టమొచ్చినా పార్టీ అండగా ఉంటుందన్నారు. సోషల్ మీడియాలో అసభ్య పదజాలాలు మాట్లాడకుండా సబ్జెట్‌పై మాత్రమే పోస్టులు పెట్టాలని సూచించారు.
సేవలు భేష్ : ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ మాట్లాడుతూ సోషల్ మీడియా కార్యకర్తల సేవలు అభినందనీయమన్నారు. ప్రతిఒక్కరికీ మంచి రోజులు వస్తాయని ధైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను సోషల్ మీడియా ద్వారా ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
కూటమి నాయకులది దుష్ప్రచారం
నరసాపురం పార్లమెంట్ ఇన్‌చార్జి గూడూరి ఉమాబాల మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై కావాలనే కూటమి నాయకులు దుష్ప్రచారం చేశారన్నారు. సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు దొడ్డ అంజిరెడ్డి, పార్టీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జి గుడాల గోపి మాట్లాడుతూ కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనంతరం సోషల్ మీడియా కార్యకర్తలు తమ అభిప్రాయాలను తె లియజేశారు. సోషల్ మీడియా జిల్లా ఉపాధ్యక్షుడు రామలింగేశ్వరరెడ్డి, ప్రధాన కార్యదర్శి పాలి రాంబాబు, అధికార ప్రతినిధులు కోట సత్యనారా యణ, కామన నాగేశ్వరరావు, ముప్పిడి సంపత్‌కు మార్, జి.సుందర్‌కుమార్ గుబ్బల వీరబ్రహ్మం, వే ణుమాధవరెడ్డి, కోడె యుగంధర్, సోషల్ మీడియా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియాకు అండగా ఉంటాం
పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు
Comments
Please login to add a commentAdd a comment