పెంటపాడు: మండలంలో జెడ్పీ స్థలాలను గుర్తించి అవి అన్యాక్రాంతం కాకుండా తక్షణం శ్రద్ధ పెట్టినట్లు జెడ్పీ సీఈవో కే సుబ్బారావు పేర్కొన్నారు. శనివారం ఆయన పెంటపాడు మండల ఎంపీడీవో కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మండల ప్రగతికి సంబంధించిన రికార్డులు పరిశీలించారు. అనంతరం ప్రత్తిపాడు వద్ద జెడ్పీ స్థలాలు గుర్తించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ జెడ్పీ స్కూళ్లు, క్రీడా మైదానాలు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకొంటున్నామన్నారు. సర్పంచ్‌లు, కార్యదర్శులు వీటిని రెవెన్యూ ద్వారా గుర్తించాలన్నారు. ప్రహరీ గోడలు కట్టించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఉప్పులూరి వరలక్ష్మి, ఎంపీడీవో బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment