శ్రీవారి సన్నిధిలో సినీ తారల సందడి
ద్వారకాతిరుమల: చినవెంకన్న దివ్య క్షేత్రంలో సినీ నేపథ్య గాయని సునీత, సినీ నటి రేణూ దేశాయ్ శనివారం సందడి చేశారు. వేర్వేరుగా ఆలయానికి విచ్చేసిన వారు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన సింగర్ సునీత ముందుగా ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత ఆలయ ముఖ మండపంలో పండితుల నుంచి వేద ఆశీర్వచనాన్ని పొందారు. అలాగే నటి రేణుదేశాయ్ సాయంత్రం శ్రీవారిని, అమ్మవార్లను దర్శించి, ప్రత్యేక పూజలు జరుపుకుని, పండితుల నుంచి వేద ఆశీర్వచనాన్ని పొందారు. గాయని సునీత, నటి రేణూ దేశాయ్‌లతో పలువురు భక్తులు, అభిమానులు ఫొటోలు, సెల్ఫీలు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment