జాతీయస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపిక
భీమవరం: జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ నెట్‌బాల్ పోటీలకు పట్టణంలోని సీఎస్‌ఎన్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ ఎండీ సలీంఖాన్, ఫిజికల్ డైరెక్టర్ దావూద్‌ఖాన్ తెలిపారు. ఈనెల 25వ తేదీ నుంచి నాలుగు రోజులపాటు చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని కోర్బాలో నిర్వహించే 68వ జాతీయస్థాయి స్కూల్‌గేమ్స్ నెట్‌బాల్ అండర్ –19 పోటీలకు తమ విద్యార్థులు ఫణీంద్ర కుమార్, టి కేశవ మణికంఠ ఎంపికయ్యారన్నారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ అండర్–19 నెట్‌బాల్ పోటీల్లో జిల్లా బాలుర జట్టు ప్రథమస్థానం సాధించగా ఆ జట్టులో పాల్గొన్న తమ విద్యార్థులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు వివరించారు. పోటీలకు ఎంపికై న క్రీడాకారులను శనివారం కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ చీడే సత్యనారాయణ అభినందించారు.
జానపద కళాకారుల సంఘం అధ్యక్షుడిగా కృష్ణబాబు
జంగారెడ్డిగూడెం: ఆంధ్రప్రదేశ్ జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్‌ఆర్ కృష్ణబాబు ఎన్నికయ్యారు. శనివారం అమరావతిలో జరిగిన కార్యవర్గ సమావేశంలో నూతన కార్యవర్గం ఏర్పాటైంది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్‌ఆర్ కృష్ణబాబు, ప్రధాన కార్యదర్శిగా కుమార్‌నాయక్, కోశాధికారిగా మల్లెల సరోజమ్మ, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వీర్నాల కృష్ణ, గౌరవ అధ్యక్షుడిగా భూతిరాజు శ్రీనివాసరాజు, మరికొందరు సభ్యులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎల్‌ఆర్ కృష్ణబాబు మాట్లాడుతూ నూతన కార్యవర్గంలోని సభ్యులు రాష్ట్రంలోని జానపద వృత్తి కళాకారుల అభ్యున్నతి కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. కృష్ణబాబుకు జంగారెడ్డిగూడెం పట్టణ ప్రముఖులు, పలువురు పెద్దలు అభినందనలు తెలిపారు.
పేకాట శిబిరంపై దాడి
భీమవరం: పేకాట శిబిరం నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు. పట్టణంలోని బలుసుమూడిలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నారనే సమాచారం టూటౌన్ సీఐ కాళీచరణ్‌కు రావడంతో శుక్రవారం రాత్రి ఆయన హెడ్‌కానిస్టేబుల్ గోవిందరాజులు, నరేష్, నాగేంద్రతో కలసి దాడి చేశారు. 8 మంది జూదరులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.లక్షా 12 వేల నగదు, నాలుగు మోటారుసైకిళ్లు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment