టెక్‌జైట్–25 పోస్టర్ ఆవిష్కరణ
నూజివీడు: విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించేందుకు సాంకేతిక సంబరం పేరుతో నిర్వహించే టెక్‌జైట్–25 కార్యక్రమం దోహదపడుతుందని ఆర్జీయూకేటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎం విజయ్‌కుమార్ అన్నారు. ఫిబ్రవరి 25 నుంచి 27వ తేదీ వరకు నూజివీడు ట్రిపుల్ ఐటీలో నిర్వహించనున్న టెక్‌జైట్–25 కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను శనివారం వైస్‌ఛాన్సలర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమలో ఉన్న సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి, వారి నైపుణ్యాలను పెంచుకోవడానికి టెక్‌ఫెస్ట్ ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి పలు రీసెర్చ్ ఆర్గనైజేషన్‌లను, వివిధ కంపెనీలను సైతం ఆహ్వానిస్తున్నామన్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్, నూజివీడు ఇన్‌చార్జి డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ మాట్లాడుతూ ఈ టెక్‌జైట్‌లో పాల్గొనేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీ, ఐఐటీ, ఇతర సాంకేతిక విశ్వవిద్యాలయాలకు ఆహ్వానాలను పంపనున్నట్లు తెలిపారు. ఈ టెక్‌ఫెస్ట్‌లో దాదాపు 5వేల మంది విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఇందులో విజేతలుగా నిలిచిన వారికి రూ.5 లక్షల విలువైన బహుమతులను అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్‌డీఏసీ కన్వీనర్ బీ జ్యోతీలాల్‌నాయక్, యూనివర్సిటీ ప్లేస్‌మెంట్ డీన్ పీ శ్యామ్, డీన్ అకడమిక్స్ రత్నాకర్, ఫైనాన్స్ ఆఫీసర్ నాగార్జునదేవి, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment