సావిత్రిబాయి పూలేకు ఘన నివాళి
తణుకు అర్బన్: మహిళలంతా విద్యావంతులు కావాలని దేశంలో తొలిసారిగా మహిళా వి ద్యకు పునాది వేసిన మహనీయురాలు సావిత్రి బాయి పూలే అని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శుక్రవారం స్థాని క రాష్ట్రపతి రోడ్డులోని పూలే విగ్రహాలకు ఆ యన పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యతోనే ప్రాంతం, కుటుంబం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశాన్ని సమాజానికి చాటిచెప్పడమే కాకుండా ఆచరణలో చూపిన పూలేను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచిన మహనీయురాలు పూలే అని స్పష్టం చేశారు. నాయకులు పొట్ల సురేష్, జంగం ఆనంద్‌కుమార్, జల్లూరి జగదీష్, షేక్ ఫహీమా, కొమ్మో జు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేట్ విధానాలతో ప్రజలకు అన్యాయం
భీమవరం: రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ల అనుకూల విధానాలను అవలంబిస్తూ ప్రజలకు తీవ్ర అ న్యాయం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి.ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం 26వ జిల్లా మహాసభ లను శుక్రవారం భీమవరంలో ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు విజన్‌లో కేవలం కార్పొరేట్ వర్గాల తప్ప రైతులు, శ్రామికులు, కార్మికులు, ఉద్యోగులు, పేదలు లేరని మండిపడ్డారు. చంద్రబాబు సూపర్ సిక్స్ అమలులో రనౌట్ అవుతున్నారని ఎద్దేవా చేశారు. జిల్లా కార్యదర్శి బి. బలరామ్ మాట్లాడుతూ పచ్చని పశ్చిమగోదా వరి జిల్లా కాలుష్య గోదావరిగా మారిందని ఆ వేదన వ్యక్తం చేశారు. ముందుగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కార్యదర్శి వ ర్గ సభ్యుడు జేఎన్‌వీ గోపాలన్, చింతకాయల బాబురావు, బి.వాసుదేవరావు పాల్గొన్నారు.
6న గ్రామ సభలు
భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లాలోని ఆకివీడు, ఉండి, పెంటపాడు, గణపవరం, కాళ్ల మండలాల్లో ఎకో సెన్సిటివ్ జోన్ ఖరారుపై ఈనెల 6న గ్రామసభలు నిర్వహించనున్నట్టు ఎకో సె న్సిటివ్ జోన్ జిల్లా మానిటరింగ్ కమిటీ చైర్మన్, కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. కొల్లేరు అభయారణ్యం చుట్టుపక్కల ఎకో సెన్సిటివ్ జోన్ ఖరారు చేయడంపై ఆయా మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో సభలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటామన్నారు. ఆకివీడులో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మిగిలిన చోట్ల మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభలు నిర్వహిస్తామని చెప్పారు.
నేడు జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన
భీమవరం: వీరవాసరం ఎంఆర్‌కే జెడ్పీ హైస్కూల్‌లో శనివారం జరిగే జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేయాలని సర్వశిక్షా అభియాన్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ పి.శ్యాంసుందర్, జిల్లా సైన్స్ అధికారి వీఎంజెడ్ శ్యాంప్రసాద్ శుక్ర వారం ఓ ప్రకటనలో కోరారు. వైజ్ఞానిక ప్రదర్శన కోసం ఏర్పాటుచేసిన కమిటీలు సమన్వ యంతో పనిచేయాలన్నారు. ఎగ్జిబిట్స్‌ను సకాలంలో ఏర్పాటుచేసి ప్రదర్శించాలని కోరారు.
భూసేకరణ వేగిరపర్చాలి
భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లాలో ఎన్‌హెచ్–165 భూసేకరణ పనులను వేగవంతం చే యాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పామర్రు–దిగమర్రు ఎన్‌హెచ్–165 భూసేకరణలో భాగంగా ఆరు కిలోమీటర్ల పరిధిలో ఆకివీడు మండలంలోని ఆకివీడు, దుంపగడప, అజ్జమూరు గ్రా మాలకు చెందిన భూములకు సంబంధించి భూసేకరణ అధికారి భీమవరం ఆర్డీఓ తయారుచేసిన అవార్డులపై విచారణ నిర్వహించారు. భూ సేకరణ కొలతలు, భూ యజమానుల పే ర్లు తప్పుల సవరణ, ఫిర్యాదుల స్వీకరణకు ఒక తేదీని ఖరారు చేసి గ్రామ సభలు నిర్వహించాలని సూచించారు. ఆర్డీఓ కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ల్యాండ్ సూపరింటెండెంట్ రవికుమార్, ఎన్‌హెచ్–165 ఏఈ ఖాజా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment