కామవరపుకోటలో రెండు షాపుల్లో చోరీ
కామవరపుకోట: ఒక షాపు షట్టర్ తెరిచి, మరొక షాపు కిటికీ తొలగించి దొంగలు నగదు చోరీ చేసిన సంఘటన గురువారం రాత్రి కామవరపుకోట కొత్తూరులో జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామవరపుకోటకు చెందిన యన్నంశెట్టి గాంధీ బాబు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట సాయిరాం ఆటో మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు. శుక్రవారం ఉదయం షాపు తెరిచి చూసేసరికి వెనుక ఉన్న షట్టర్ తెరిచి ఉండటం చూసి షాపులోకి వెళ్ళగా రూ.70,000 నగదు చోరీకి గురైందని బాధితుడు తెలిపాడు. వడ్లమూడి జగదీష్ సొసైటీ పెట్రోల్ బంక్ ఎదురుగా శ్రీ సూర్య ఆగ్రో పురుగుమందుల షాపు నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి షాపు మూసి ఇంటికి వెళ్లి, ఉదయం వచ్చి షాపు తెరవగా కిటికీ ఉచలు తొలగించి 20,000 నగదు చోరీ చేసినట్లు బాధితుడు తెలిపాడు. బాధితుల ఫిర్యాదుతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.చెన్నారావు తెలిపారు. క్లూస్ టీం సంఘటన స్థలానికి చేరుకుని ఎస్సై ఆనందరావు, హెడ్ కానిస్టేబుల్ శంకరరావు ఆధ్వర్యంలో వేలు ముద్రలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment