పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు
పాలకోడేరు: పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా జరుగుతున్నాయని, కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాలకు సొమ్ము జమ చేయడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పాలకోడేరు మండలం గరగపర్రు రైతు సేవా కేంద్రాన్ని, మిల్లులకు తరలిస్తున్న ధాన్యం లారీలను జేసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి అక్కడ ఉన్న రైతులతో మాట్లాడుతూ మీకు సకాలంలో గోనె సంచులు ఇచ్చారా, ధాన్యం డబ్బులు జమ అయ్యాయా అని అడిగగా రైతులు చెప్పిన సమాధానంతో జేసీ సంతృప్తి వ్యక్తం చేశారు. దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దని, రైతు సేవా కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధరను పొంది ఆర్థికంగా బలపడాలని రైతులకు ఆయన సూచించారు. రైతు సేవా కేంద్రంలో కొనుగోలు చేసే సమయంలో తూకం, తేమశాతం, రికార్డుల నిర్వహణ, డేటా ఎంట్రీలను జేసీ పరిశీలించారు. గోనె సంచుల గోదామును పరిశీలించి చిరిగిన గోనె సంచులను వేరే చోట పెట్టాలని ఎట్టి పరిస్థితుల్లో చిరిగిన గోనె సంచులను రైతులకు ఇవ్వరాదని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎన్ భారతి విజయలక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment