8 మందిపై బైండోవర్ కేసులు
ఆగిరిపల్లి: మండలంలో పలు గ్రామాలకు చెందిన 8 మందిపై స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ మస్తానయ్య తెలిపారు. మండలంలో అక్రమంగా నల్ల బెల్లం అమ్ముతున్న యండురి అప్పారావు, కలిదిండి జగదీశ్వర్‌రావును బైండోవర్ చేశారు. బెల్టు షాపు నిర్వాహకులు కొండేటి నాగరాజు, పరసా జమలయ్య, పరసా కొండలరావు, దొండపాటి ఆంజనేయులు, గుంజి గంగా, బాణాల చక్రంను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు తెలిపారు. తహసీల్దార్ ప్రసాద్ మాట్లాడుతూ మళ్లీ నేరాలకు పాల్పడితే రూ.లక్ష పాయలు జరిమానా విధించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని హెచ్చరించారు.
వేధింపుల కేసులో భర్తకు పదేళ్ల జైలు
ఏలూరు (టూటౌన్): భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య చేసుకున్న కేసులో నేరం రుజువు కావడంతో ఏలూరు మహిళా కోర్టు 5వ అదనపు జిల్లా జడ్జి జి.రాజేశ్వరి నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించారు. 2016లో నమోదైన ఈ కేసులో లింగపాలెం మండలం బాదరాలకు చెందిన దొండపాటి కోటేశ్వరరావుకు మృతురాలు ప్రభావతికి 2010లో వివాహం జరిగింది. ప్రభావతితో వివాహం కాకముందు నుంచే కోటేశ్వరరావుకు వివాహేతర సంబంధం ఉండడంతో పాటు.. భార్యను వేధింపులు గురి చేసేవాడు. పలుమార్లు పెద్దల్లో పెట్టి నచ్చజెప్పినా కోటేశ్వరావులో ఏమాత్రం మార్పు రాలేదు. భర్త వేధింపులతో మనస్తాపానికి గురైన ప్రభావతి ఇద్దరు పిల్లలతో కలిపి 2016 ఏప్రిల్ 16న గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రభావతి, ఆమె కుమార్తె చనిపోగా కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
వేధింపుల కేసు నమోదు
టి.నరసాపురం: వేధింపులపై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెచ్‌సీ ఎం.రాజు తెలిపారు. మండలంలోని బొర్రంపాలెం గ్రామానికి చెందిన పరసా వెంకటేశ్వరరావు అదే గ్రామానికి చెందిన వెంకటలక్ష్మిని 2015లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. మద్యానికి బానిసైన వెంకటేశ్వరరావు తాగొచ్చి కట్నం తీసుకురావాలని వేధిస్తున్నాడని, వెంకటేశ్వరరావు కుటుంబసభ్యులు సహకరిస్తున్నారని వెంకటలక్ష్మి ఫిర్యాదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment