కువైట్‌లో ఘనంగా వేడుకలు
నరసాపురం: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను కువైట్‌లో నరసాపురానికి చెందిన ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. కువైట్ హవల్లీలోని ఆర్‌ఆర్ స్పైసీ పేరుతో నడుస్తున్న ఇండియా రెస్టారెంట్‌లో వేడుకలు జరిగాయి. నరసాపురానికి చెందిన ఈదా రాజు ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు వ్యాపారవేత్త, కువైట్ వైఎస్సార్‌సీపీ కన్వీనర్ ముమ్ముడి బాలిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటినా ప్రజా సంక్షేమం పట్టించుకోకుండా మంత్రి లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈదా రాజు మాట్లాడుతూ కువైట్‌లోని ప్రవాసాంధ్రులు రోజూ జగన్ పాలనను గుర్తుచేసుకుంటున్నారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్‌ను గెలిపించుకుంటామని ఆంధ్రప్రదేశ్ ప్రజలు డిసైడ్ అయ్యారన్నారు. ప్రవాసాంధ్రులు వి.నరసారెడ్డి, నాయని మహేశ్వరరెడ్డి, గోవింద్ నాగరాజు, కావేటి రమణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment