పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ ఎన్నిక
భీమవరం (ప్రకాశంచౌక్): గోదావరి పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్ని కలు ప్రశాంతంగా ముగిశాయని జాయింట్ కలెక్టర్, ఎన్నికల అధికారి టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో 20 మంది నీటి పంపిణీ సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షులు జిల్లా ప్రాజెక్టు కమిటీకి అధ్యక్షుడిగా కునాధరాజు మురళీ కృష్ణంరాజును, ఉపాధ్యక్షుడిగా గుబ్బల మర్రాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని చెప్పారు. అనంతరం వీరికి నియామక పత్రాలు అందించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మాజీ ఎంపీ తోట సీతామహాలక్ష్మి, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు పాల్గొన్నారు.
పీడీఎస్ బియ్యం అవకతవకలను ఉపేక్షించం
కలెక్టర్ నాగరాణి
భీమవరం అర్బన్: పీడీఎస్ బియ్యం అవతవకలను ఉపేక్షించమని, కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. నరసింహపురంలోని శ్రీ రాధాకృష్ణ రైస్ మిల్, లక్ష్మీ కృష్ణ రైస్ ట్రేడర్స్‌ను శనివారం ఆమె తనిఖీ చేశారు. రైసుమిల్లును, మిల్లులోని సీ ఎంఆర్ బియ్యం నిల్వలను పరిశీలించారు. రై తులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం నిబంధనలు సడలించిందని, దీనికి అనుగుణంగా మిల్లర్లు సహకరించి ఆఖరి గింజ వ ర కు కొనుగోలు చేయాలని ఆమె సూచించా రు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరగకూడదన్నారు. నిబద్ధతగా వ్యాపార లావాదేవీలు నిర్వహించాలని సూచించారు. డీఎస్‌ఓ ఎన్.సరోజ, ఏఎస్‌ఓ ఎంవీ రవిశంకర్, సిబ్బంది ఆమె వెంట ఉన్నారు.
పార్కుల అభివృద్ధికి చర్యలు
భీమవరం (ప్రకాశంచౌక్): పార్కుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. శనివా రం భీమవరం హౌసింగ్ బోర్డులోని చిల్డ్రన్ అండ్ వాకింగ్ పార్కు, ఆదిత్య కళావేదిక పార్కును ఆమె సందర్శించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కమిషనర్ రామచంద్రారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.
సమర్థంగా పనిచేయాలి
భీమవరం (ప్రకాశంచౌక్): కస్టోడియన్ అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహించా లని జేసీ టి.రాహుల్‌కుమార్ రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, తహసీల్దా ర్లు, మండల వ్యవసాయ అధికారులు, కో–ఆపరేటివ్ శాఖ అధికారులు, సీఎస్ డిటీలు, ఆర్‌ఎస్‌కే సిబ్బందితో ధాన్యం సేకరణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల ద్వారా మిల్లులకు వచ్చిన ధాన్యం లో డులు వెంటనే దిగుమతి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
చట్టాలపై నైపుణ్యం పెంచుకోవాలి
ఏలూరు (టూటౌన్): మారుతున్న చట్టాలపై న్యాయమూర్తులు అవగాహన పెంచుకోవాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తం కుమార్ పిలుపునిచ్చా రు. ఏలూరులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉమ్మడి జిల్లా న్యాయమూర్తులకు ఒక రోజు శిక్షణ తరగతులను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పురుషోత్తంకుమార్ మాట్లాడుతూ శిక్షణా తరగతిలో ఫ్రెమింగ్ ఆఫ్ చార్జెస్, సెక్షన్ 311, 313, 319 సీఆర్‌పీసీ, బాధితులు–పరిహారం మొదలైన చట్టాలపైన అవగాహన కల్పించామన్నారు. రిసోర్స్ పర్సన్‌లుగా వైవీ రామకృష్ణ, జీవీ కృష్ణయ్య, ఏపీ సురేష్, ఎం.సునీల్‌కుమార్ వ్యవహరించారు. న్యాయమూర్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment