నిధుల దుర్వినియోగం కేసులో అరెస్టు
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడితే క్రిమినల్ చర్యలు తప్పవని కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. పాలకొల్లు ఏరియా ఆస్పత్రిలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కుంచె మురళి వెంకట తులసీదర్‌ను ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, చెక్కుల ఫోర్జరీ కేసులో అరెస్టు చేసినట్లు తెలిపారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఓ.రవికుమార్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు నిర్వహించి సుమారు రూ.62 లక్షల వరకు నిధులను దుర్వినియోగం చేసినట్లు దర్యాప్తులో తేల్చారు.
Comments
Please login to add a commentAdd a comment