పనులు వేగిరపర్చాలి
ఏలూరు(మెట్రో): జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో చేపట్టిన టాయిలెట్స్, తాగునీటి సౌకర్యం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన పనుల ప్రగతిపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మంగళవారం సమీక్షించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో 225 టాయిలెట్లు పూర్తయ్యాయని, తాగునీటి పనులు 176 కేంద్రాల్లో పూర్తయయ్యాని మిగిలిన పనులను కూడా ఈ వారం చివరిలోగా పూర్తి చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పోషణ వాటిక, హార్వెస్టింగ్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. అలాగే జల్‌జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు 14,284 లక్ష్య కాగా ఇప్పటివరకు 6022 కనెక్షన్‌లు మాత్రమే అందించారని, మిగిలినవి కూడా నిర్ధేశించిన సమయంలోగా అందించాలని కలెక్టర్ ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. ఆర్‌డబ్ల్యూఎస్ సూపరింటెండెండింగ్ ఇంజనీర్ జి.త్రినాధబాబు, ఐసీడీఎస్ ఈఓ మల్లిక, మండల స్థాయి సీడీపీఓలు, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment