ఇరిగేషన్ స్థలం పరిశీలన
కాళ్ల: ప్రభుత్వ అవసరాల కోసం కాళ్ళ మండలం పెదఅమిరం మహాత్మా గాంధీ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ దగ్గరలో నీటిపారుదల శాఖకు సంబంధించిన మూడున్నర ఎకరాల భూమిని సంబంధిత శాఖ అధికారులతో కలిసి జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ భూమికి సంబంధించిన మ్యాప్‌లు, స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రభుత్వ భవన నిర్మాణాల కోసం స్థలం పరిశీలించామన్నారు. ఇందుకు సంబంధించిన భూమి వివరాలపై పూర్తిస్థాయి నివేదికను అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. జేసీ వెంట ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, నీటిపారుల శాఖ అధికారి పి.నాగార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
శిక్షణకు పలువురు జడ్జీలు
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పలు కోర్టుల్లో పనిచేస్తున్న పలువురు జడ్జీలు ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి 10 వారాల శిక్షణ కోసం వెళ్లనున్నారు. దీనికి సంబంధించి హైకోర్టు రిజిస్ట్రార్ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 20 నుంచి మార్చి 28 వరకు ఈ శిక్షణ కార్యక్రమం జరగనుంది. ఉమ్మడి పశ్చిమగోదావరి నుంచి శిక్షణకు ఎంపికై న వారిలో వి.రఘునాఽథ్, ఫస్ట్ అడిషనల్ సివిల్ జడ్జి, కె.స్పందన, స్పెషల్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్, ఎకై ్సజ్ కోర్టు, టి.ఆంజనేయ ఎస్‌ఎస్ రామ ఆదిత్య రిషిక్, సివిల్ జడ్జి, భీమడోలు, ఏ.వెంకట నాగరాజు, సెకండ్ అడిషనల్ సివిల్ జడ్జి, తణుకు, డి.అరుంధతి, ఫస్ట్ అడిషనల్ సివిల్ జడ్జి, తాడేపల్లిగూడెం, జొన్నలపల్లి బీటీఎస్ దేవి, ఫస్ట్ అడిషనల్ సివిల్ జడ్జి, కొవ్వూరు ఉన్నారు.
క్రీస్తు మార్గం అనుసరించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, ప్రేమ, కరుణ గొప్పతనాన్ని ఏసుక్రీస్తు తన బోధనలు ద్వారా విశ్వ మానవాళికి తెలియజేశారన్నారు. క్రీస్తు అనుసరించిన మార్గం ఎంతో ఆదర్శమన్నారు. ఏసుక్రీస్తు ప్రపంచ సర్వమత శాంతి స్థాపన కోసం పుట్టిన మహనీయుడు, గొప్ప శాంతి దూతన్నారు. ఆయన చూపిన శాంతి మార్గంలో పయనించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ అన్నారు.
తత్కాల్‌లో పరీక్ష ఫీజులు చెల్లించే అవకాశం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వచ్చే మార్చిలో జరిగే 10వ తరగతి పరీక్షలకు తత్కాల్ విధానంలో ఫీజులు చెల్లించడానికి అవకాశం కల్పించామని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. రూ.1000 అపరాధ రుసుంతో ఈ నెల 27 నుంచి జనవరి 10 వరకూ ఫీజులు చెల్లించవచ్చన్నారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలోని ఎస్‌ఎస్‌సీ, ఓఎస్‌ఎస్‌సీ, ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలకు రెగ్యులర్, గతంలో అనుత్తీర్ణులై ప్రస్తుతం ప్రైవేట్‌గా హాజరు కాగోరు అభ్యర్థులకు ఈ వివరాలు తెలిపి ఫీజు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment