అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు
డీఆర్వో వెంకటేశ్వర్లు
భీమవరం(ప్రకాశం చౌక్): ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) అర్జీల పరిష్కారంలో జాప్యం తగదని డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ (మీకోసం)లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరితగతిన అర్జీలు పరిష్కరించాలని సూచించారు. అర్జీలు రీ ఓపెన్ అయితే తగు కారణాలను వివరించాలన్నా రు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్ర జల నుంచి 142 అర్జీలు స్వీకరించారు. సివిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్ టి.శివరామ ప్రసాద్, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇళ్లు తొలగిస్తారని ఆందోళన
పాలకొల్లు మండలం యాళ్లవానిగరువు ప్రాంతానికి చెందిన 30 కుటుంబాలు 70 ఏళ్లుగా చించినాడ రోడ్డులోని ప్రభుత్వ భూమిలో ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్నారు. అయితే ఇటీవల కొందరు లేఅవుట్ చేస్తున్నామంటూ వీరి ఇళ్లు తొలగించడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే చెట్లు కూడా నరికివేశారని, తమ ఇళ్లు తొలగించకుండా న్యాయం చేయాలంటూ వీరంతా మీకోసంలో డీఆర్వోను కలిసి అర్జీ అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment