జిల్లాలో ఓటర్లు 14,70,852
మహిళా ఓటర్లే అధికం
భీమవరం(ప్రకాశం చౌక్): ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ–2025 ప్రక్రియ అనంతరం ఓటర్ల తుది జాబితాను కలెక్టర్ నాగరాణి ప్రకటించారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాలు, ఎల క్టోరల్ అధికారి, సహాయ ఎలక్టోరల్ అధికారి కార్యాలయాలు, కలెక్టరేట్‌లో జాబితాను ప్రకటించినట్టు చెప్పారు. జిల్లాలో 1,461 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 14,70,852 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుష ఓటర్లు 7,20,597, మహిళా ఓటర్లు 7,50,179, థర్డ్ జెండర్ 76 మంది ఉన్నారు. గతేడాది అక్టోబరు 29న ప్రచురించిన ముసాయిదా జాబితాలో 14,71,189 మంది ఉండగా, సవరణల అనంతరం తుది జాబితా నాటికి సుమారు 337 మంది ఓటర్లు తగ్గారు. అత్యధికంగా భీమవరం నియోజకవర్గంలో 2,52,255 మంది ఓటర్లు ఉండగా, తక్కువగా నరసాపురం ని యోజకవర్గంలో 1,70,683 మంది ఉన్నారు. సర్వీస్ ఓటర్లు 888 మంది ఉండగా వారిలో 868 మంది పురుషులు, 20 మంది మహిళలు ఉన్నారు. జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment